ఒక దేశంలోని స్థానిక ప్రభుత్వం నవ్వడం కోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా రోజులో కనీసం ఒక్కసారైన నవ్వేలా వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిపై కొన్ని రకాల విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ఈ చట్టాన్ని కేవలం ప్రజల మానసిక ఆరోగ్యం కోసమే తప్ప బలవంతంగా నవ్వేలా చేయడం కాదని చెప్పి మరీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..
జపాన్‌లో యమగటా ఫ్రిఫెక్చర్‌లోని స్థానిక ప్రభుత్వం నవ్వు కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. గతవారం నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చింది. స్థానిక విశ్వవిద్యాయల పరిశోధనల్లో 'నవ్వు' మంచి ఆరోగ్యాన్ని అందించగలదని తేలడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవ్వడం వల్ల ఎన్నో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందేలా స్థానిక ప్రజలను.. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వేలా ప్రోత్సహించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
అందుకోసం నవ్వులతో నిండిన కార్యాలయ వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా వ్యాపార నిర్వాహకులను కోరుతోంది స్థానికి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ప్రతి నెల ఎమనిమిదొవ తేదీని నివాసితులు నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దినంగా నిర్ణయించింది. యమగటా విశ్వవిద్యాలయంలోని మెడిసిన్ ఫ్యాకల్టీ నవ్వులపై జరిపిన పరిశోధనల్లో నవ్వుతో మంచి ఆరోగ్యం తోపాటు దీర్ఘాయువు పెరుగుతుందని తేలింది. అలాగు రకరకాల కారణాలతో దారితీస్తున్న మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఈ నవ్వు ద్వారా తగ్గుతాయని పరిశోధన వెల్లడించింది. అంతేగాదు అధ్యయనం 'నవ్వు' సానుకూల వైఖరితో ప్రవర్తించేలా సమర్థత, విశ్వాసం, నిష్కాపట్యతతో ఉండేలా చేస్తుందని పేర్కొంది .
అయితే ఈ నియమాన్ని జపాన్‌లోని చాలామంది రాజకీయనాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది వారి రాజ్యంగ హక్కులను ఉల్లంఘించడం కిందకు వస్తుందని, నవ్వలేని వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. అంతేగాదు నవ్వడం లేదా నవ్వకుండా ఉండటం అనేది వారి అంతర్గత ఆలోచన, స్వేచ్ఛకు సంబంధించింది. పైగా ఇది రాజ్యంగం ద్వారా ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి కూడా అని జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(జేసీపీ)నేత టోరు సెకి అన్నారు. అలాగే అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల నవ్వడానికి ఇబ్బంది పడే వారి మానవ హక్కులను మనం అణగదొక్కకూడదు అని కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీజేపీ) సభ్యుడు సటోరు ఇషిగురో అన్నారు.
కానీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నేత కౌరీ ఇటో ఆ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రజలను నవ్వమని బలవంతం చేయదు. ఇది ఒక వ్యక్తి, అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తుందని కూడా నొక్కి చెప్పారు కౌరీ ఇటో. అలాగే ఈ కొత్త నిబంధన ప్రకారం రోజుకు ఒక్కసారైనా నవ్వలేని వారికి జరిమానా విధించే నిబంధన కూడా లేదని స్థానికి అధికారులు స్పష్టం చేశారు.
(చదవండి: బియ్యం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment