జపాన్‌కి చెందిన ఓ కుర్రాడు తన తండ్రిని వెతుకుతూ భారత్‌లోకి వచ్చాడు. తండ్రి జాడ కోసం అనువణువు గాలించి మరీ వెతికి పట్టుకున్నాడు. అదీకూడా 19 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంటే ఆ అనందం వేరేలెవెల్. మాటలకందని ఆ ఆనందం ఊహకందని నమ్మలేని నిజంలా అనిపిస్తుంది. అలాంటి సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్ థాయిలాండ్‌లో జపనీస్ మహిళ సాచీని కలుసుకున్నాడు. 2002లో ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. టోక్యో సమీపంలో చిబాకెన్‌లో ఆమెతో కలిసి నివశించాడు. కొన్నాళ్లకే వైవాహిక బంధంలో సమస్యలు వచ్చి విడిపోయారు. అప్పటికే వారికి రెండేళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అయితే రిన్ తన తల్లి సాచీ వద్దే పెరిగాడు. 2007లో భారత్‌కు తిరిగివచ్చిన సుఖ్‌పాల్‌కు కొడుకు లేదా భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం జపాన్‌లో ఉంటున్న రిన్ తన తండ్రిని కలవడానికి ఇటీవలే పంజాబ్ వెళ్లాడు.
కేవలం అలనాటి తండ్రి ఫోటో, అడ్రస్ సాయంతో అవిశ్రాంతంగా ఆచూకీ కోసం వెతికాడు. చివరికి తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సుఖ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ..తన ఫోటో సాయంతో ప్రజలందర్ని అడుగుతూ వస్తూ తనని కనుక్కున్నాడని అన్నారు. తన కొడుకుని కలవడం నిజంగా నమ్మలేకున్నా. ఇది ఒక కలలా ఉంది. నా కొడుకుని కలవాలని చాలసార్లు అనుకున్నా కానీ అది సాధ్య పడదని వదిలేశాను. ఇలా తన కొడుకే తనని వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు ." సుఖ్‌పాల్ సింగ్.
ఇక రిన్ జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో కుటుంబ వృక్షం అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లివైపు కుటుంబసభ్యులే తెలుసు తప్ప తండ్రి గురించి ఏం తెలియదని గ్రహించి..రిఎలాగైనా కలుసుకోవాలనే సంకల్పం మొదలయ్యింది రిన్‌లో. తన తండ్రి ఆచూకీ కోస గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు వివరించాడు. ఆగస్టు 15 కల్లా తండ్రి ఉన్న ప్రదేశానికి చేరకున్నాడు. చివరికీ ఆగస్టు 18 నాటికి తన తండ్రిని కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
What a moment ❤️
Sukhpal Singh and his Japanese son Rin Takahata reunited after 19 years when Rin, inspired by a college assignment, traced his father to Amritsar, India. Rin was welcomed warmly by Sukhpal and his current family. pic.twitter.com/KExVBl6wwY— Akashdeep Thind (@thind_akashdeep) August 24, 2024
(చదవండి: నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment