![Mystery Of Chinas Guiyang White House - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/Mystery-China-Guiyang-White-House-01.jpg.webp?itok=QNfvp472)
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవంతి ఏదంటే అంతా ‘గుయాంగ్ వైట్‌హౌస్’ పేరే చెబుతున్నారు. ఇప్పుడు అది రహస్య భవంతిగా పేరు పొందింది. చైనాలోని హువాగువోయువాన్ వెట్‌ల్యాండ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఈ పన్నెండు అంతస్తుల మేడ.. అమెరికా అధ్యక్ష భవంతి వైట్‌హౌస్‌ను తలపించేలా ఉంటుంది. ముందున్న సరస్సుతో పాటు మొత్తం 18.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుందీ భవనం.
విలాసవంతమైన దాని ఇంటీరియర్‌ను రోజ్‌వుడ్‌తో చేసి ఉంటారని ఊహిస్తున్నారు. అయితే భవంతి లోపలి ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించనందున ఆ సమాచారాన్ని ఇంకా ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ భవంతిని డజన్ల కొద్దీ గార్డులు 24 గంటలూ పహారా కాస్తుంటారు. దీన్ని చూడటానికి చైనా నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతుంటారు. కానీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయితే గుయాంగ్ వైట్ హౌస్ ఎవరిదనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇది గుయిజౌ హాంగ్లిచెన్ గ్రూప్ సీఈవో జియావో చున్‌హాంగ్ నివాసమని అంటున్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు.
(చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !)
Comments
Please login to add a commentAdd a comment