prashnottara bharatam telugu spiritual story - Sakshi
Sakshi News home page

రాక్షసులు నరులను తినటం మానాలి

Published Wed, Feb 3 2021 7:00 AM | Last Updated on Wed, Feb 3 2021 10:18 AM

Prashnottara Bharatam In Telugu Spiritual Story - Sakshi

ప్రశ్న: భీముడిని చూడగానే బకాసురుడు ఏం చేశాడు?
జవాబు: భీముడి మీదకు ఉరికి వచ్చాడు. భీముని వీపు మీద ఒక్క పోటు పొడిచాడు.

ప్రశ్న:బకాసురుడి దెబ్బలకు భీముడు ఎలా ఉన్నాడు?
జవాబు: భీముడు అదరలేదు, బెదరలేదు, వెనుతిరిగి చూడలేదు, తినటం మానలేదు.

ప్రశ్న:బకాసురుడు ఏం చేశాడు?
జవాబు: సాల వృక్షాన్ని పెరికాడు. భీముని మీదకు వచ్చాడు. భీముడు బండెడు పదార్థాలు తిన్నాడు. చేతులు దులుపుకున్నాడువ, ఒళ్లు విరుచుకున్నాడు.

ప్రశ్న:భీముడు బకాసురునితో ఏ విధంగా ప్రసంగించాడు?
జవాబు: ఒరే రాక్షసాధమా! నరమాంసం తిని కొవ్వెక్కి ఉన్నాడు. అదంతా నీతో కక్కిస్తాను. నీ మదం అణగిస్తాను. పారిపోకుండా నాతో యుద్ధం చేయి... అంటూ రంకె వేశాడు.

ప్రశ్న:వారిరువురి మధ్య యుద్ధం ఎలా సాగింది?
జవాబు: మద్ది చెట్టు లాగి, యుద్ధం చేశాడు. అలా వారిద్దరూ చెట్లతో కొట్లాడటంతో, అక్కడి చెట్లన్నీ అయిపోయాయి. అప్పుడు మల్లయుద్ధానికి దిగారు.

ప్రశ్న:మల్ల యుద్ధంలో భీముడు ఏం చేశాడు?
జవాబు: భీముడు బకాసురుడిని పడగొట్టాడు.

ప్రశ్న:భీముని శరీరం ఎటువంటిది?
జవాబు:  భీముడిది వజ్ర కాయం. బకాసురుని పోటు తాకలేదు.

ప్రశ్న:భీముడు కోపంతో ఏం చేశాడు? 
జవాబు:  భీముడు లేచాడు. కోపంతో ఎడమ చేత్తో బకాసురుడి నడుం పట్టాడు. కుడి చేత్తో కంఠం పట్టాడు, మోకాలి చేత బకాసురుని వీపు విరిగేలా పొడిచాడు. ఆ పోటుకి బకాసురుని నవ ద్వారాలు రక్తం కక్కి, నడుం విరిగి, పడి, గావుకేక పెడుతూ చచ్చాడు.

ప్రశ్న:బకాసురుడు మరణించిన వార్త విని వచ్చిన బంధువులతో భీముడు ఏమన్నాడు?
జవాబు: రాక్షసులారా! బకాసురుడు నరులను తినటం వల్ల వాడికి ఈ గతి పట్టింది. ఇక మీదట రాక్షసులు నరులను తినటం మానాలి. తింటే బకాసురుని వలె చస్తారు.. అన్నాడు.

– నిర్వహణ: వైజయంతి పురాణపండ

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement