మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగిపోయి... అవి దగ్గరగా రావడంతో వెన్నుపూసల నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. తొలిదశల్లో అందరూ ఈ నొప్పిని స్పాండిలోసిస్ అని గుర్తించక నొప్పినివారణ మందులు వాడుతుంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నొప్పి యధావిధిగా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కొద్దికాలం తర్వాత అంటే కొన్ని నెలలు లేదా ఏడాదీ రెండేళ్లలో ఈ నొప్పి మెడలోనే కాకుండా భుజానికి, చేతికీ పాకుతుంది. చివరగా అది బొటనవేలు, చూపుడువేలు లేదా మధ్యవేలు వంటి చోట్లకు కూడా పాకుతుంది. కొందరిలోనైతే వేళ్లలో కాస్తంత స్పర్శ తగ్గినట్లుగా కూడా అనిపించవచ్చు.
తొలిదశలో అంటే మెడనొప్పి ఉన్న సమయాల్లోనే చికిత్స కొనసాగించి ఉంటే వ్యాధి మెడనొప్పికే పరిమితమవుతుంది. అలా వ్యాధి ముదిరినప్పుడు చేతులకూ, వేళ్లకూ పాకడం జరుగుతుంది. ఇలా చేతులకూ, వేళ్లవరకూ నొప్పి పాకుతూ స్పర్శ్ష కోల్పోయేంతవరకూ ముదిరిన పరిస్థితినీ, ఆ దశనూ వైద్యపరిభాషలో సీ–5, సీ–6 ర్యాడిక్యులోపతి గా చెప్పవచ్చు. ఇది స్పాండిలోసిస్ సవుస్య మరింత తీవ్రతరం కావడం వల్ల వచ్చే పరిణావుం.
రాడిక్యులోపతి అంటే...
వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలు వెన్నెవుుకల వుధ్యన నలిగిపోవడాన్ని ర్యాడిక్యులోపతి అని అంటారు. స్పాండిలోసిస్ సవుస్య తీవ్రం కావడంతో ఈ పరిస్థితి వస్తుంది. స్పాండిలోసిస్ సవుస్య స్టేజ్–1లో నొప్పి– భుజానికీ, చేతికీ పాకుతుంది. అదే స్టేజ్–2లో అయితే... ఆ నరం నుంచి సంకేతాలు అందే భుజం, చేయితాలూకు చర్మభాగం, చేతిలోని వేళ్లకు స్పర్శ కొంతమేర తగ్గిపోతుంది. ఇక అది స్టేజ్–3కి చేరితే ఆ నరం నుంచి సంకేతాలు అందే చేతి కండరాలు ఒకింత చచ్చుబడినట్లుగా అయిపోవడం, కొన్నిసార్లు మునపటి అంత చురుగ్గా వేళ్లు కదిలించలేకపోవడం వంటివి జరుగుతాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ సవుస్య ప్రస్తుతం స్టేజ్–2లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
చికిత్స: ర్యాడిక్యులోపతి చికిత్సలో భాగంగా నొప్పి నివారణ కోసం గాబాపెంటిన్–300ఎంజీ వంటి వూత్రలను నొప్పితీవ్రతను బట్టి రోజూ 2–3 వూత్రలు డాక్టర్ సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి, లక్షణాలను బట్టి డోలోకైన్ ఎస్సార్–200ఎంజీ వంటి నొప్పినివారణ వూత్రలనూ వాడాల్సి ఉంటుంది. నొప్పి నివారణ కోసం వాడే వుందులు చికిత్సలో ఒక ఎత్తయితే... ఈ సవుస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వురొక ఎత్తు. నిజానికి ఈ జాగ్రత్తలే ఈ ర్యాడికలోపతి చికిత్సలో చాలా ప్రధానం.
రాడిక్యులోపతిలో పాటించాల్సిన జాగ్రత్తలు
- బరువైన వస్తువ#లు ఎత్తకూడదు. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం, పిల్లలను ఎత్తుకోవడం వంటి పనులు చేయకూడదు
- బరువ#లు ఎత్తే క్రవుంలో తలపైన బరువ#లు (వుూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు పడుకునే సవుయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉంటుంది
- తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా వుడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. ఇలా వుూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
- ఈ సవుస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది
- ఖాళీ సవుయాల్లో కూర్చుని ఉండేబదులు పడుకొని ఉండటం వుంచిది.
ప్రస్తుతం మీరు స్టేజ్–2లో ఉన్నా... వుందులు, పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ సవుస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మీకు ఉన్న సవుస్య అదేనని నిర్ధారణ చేసుకునేందుకు వుుందుగా ఒకసారి ఎవ్మూరై సర్వైకల్ స్పైన్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
-డాక్టర్ లలిత
పిడపర్తి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment