కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివభక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామాలకెళ్లిన శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ దూరంలో సూగూరేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో వెలిశాయని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు వెలిశాడు.
విజయనగర సామ్రాజ్యాధిపతులైన ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కొల్హాపుర దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభు కలలో కనిపించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభు గర్భగుడిని నిర్మించారు.
పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం గట్టిగా నెలకొంది. దేవాలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసిన శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది.
ప్రతి నిత్యం త్రికాల పూజలు
స్వామి జాతర, రథోత్సవాలు రెండున్నాయి. దక్షిణ, తూర్పు, పడమరల్లో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా ఉంది. పడమరలో గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. ఉదయం 5, మధ్యాహ్నం 11, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరులో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు.
అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం రెండు వందల మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి భోజనం ఏర్పాటు దేవాలయం కమిటీ నిర్దారించారు. పెళ్లి చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా కేటాయిస్తామని అధికారి సురేష్ వర్మ తెలిపారు.
7న జోడు రథోత్సవాలు:
శనివారం దేవసూగూరు సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని దేవాలయ కమిటీ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గజానన తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముంబై, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్ వివరించారు.
(చదవండి: మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..? ఈ పండుగ విశిష్టత)
Comments
Please login to add a commentAdd a comment