![Stay On The Island For Three Days For Free](/styles/webp/s3/article_images/2024/06/30/island.jpg.webp?itok=OAZN-C4D)
పర్యాటక ప్రదేశాలకు వెళితే వసతి, భోజనాల కోసం ఖర్చులు తప్పవు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనైతే ఈ ఖర్చులు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే, చరిత్రాత్మకమైన ఈ ఇటాలియన్ దీవిని సందర్శించాలనుకునే పర్యాటకులకు ఒక సంస్థ మూడు రోజులు ఉచితంగా బస కల్పిస్తోంది.
‘కామినో మినరేరియో’ అనే సంస్థ ముప్పయి ఐదేళ్ల లోపు వయసు గల దేశ విదేశాలకు చెందిన పర్యాటకులకు సార్డీనియా దీవిని సందర్శించేందుకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ దీవిలో పురాతన రోమన్ నిర్మాణాలు సహా అనేక చారిత్రక నిర్మాణాలు, కొండలు, లోయలు, పురాతన గుహలు, అడవులు, జలపాతాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి.
దాదాపు 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ దీవిలో మధ్యయుగాల నాటి శాంటా బార్బరా గనులు, రాతిమెట్లతో కూడిన ‘పవిత్ర బావులు’ లోపలకు వెళ్లి చూడాలంటే గుండెధైర్యం ఉండాలి. దీవి చుట్టూ మధ్యధరా సముద్ర తీరం, అందమైన బీచ్‌లు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ దీవిలోని పోర్టోసుకో పట్టణంలోని హోటళ్లలో పర్యాటకులకు బస కల్పిస్తారు. అక్కడి నుంచి రోజుకు ఒక దిశగా తీసుకువెళ్లి, దీవిలోని పర్యాటక ఆకర్షణలను చూపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment