ఓ మోస్తారు కారు కొనగానే కళ్లు నెత్తిమీదకు వచ్చేస్తాయి. ఎంత పొగరుగానే ప్రవర్తిస్తారు. కొంచెం చెయ్యి కారుకి తగలగానే మండిపడిపోతుంటారు. సరదాగా ఆ కారుతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశామా ఇక పని అయిపోయినట్లే..! అలా ఉంటుంది కొదరి తీరు. ఏదో మనకు మాత్రమే కారు ఉందన్నట్లు ఇచ్చే పోజు మాములుగా ఉండదు. కానీ ఇక్కడొక కుర్రాడు అలా చేయలేదు.
ఏం చేశాడంటే..ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చక్కటి పసుపు రంగు కారు వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకునే పనిలో ఉన్నాడు. ఎవ్వరూ లేరు కదా అని ధీమాగా తీసుకుంటున్నాడు. ఇంతలో మంచి స్మార్ట్‌గా ఉన్న యువకుడు వచ్చాడు. అతడే ఆ కారు యజమాని. అతడిని చూసి ఈ మతిస్థిమితం లేని వ్యక్తి భయంతో వెళ్లిపోతున్నాడు. వెంటనే ఆ యువకుడు వచ్చి అతడిని వారించి, అతడి సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీలు చూసి నవ్వాడు. ఆ తర్వాత ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని చక్కగా కారులోకి ఆహ్వానించి తనతో తీసుకువెళ్లాడు.
ఆ వ్యక్తి ఎంతగా ఆనందపడ్డాడో చూస్తే కన్నీళ్లు ఆగవు. అతడు కూడా ఆ యువకుడు ఇంత ఔదార్యంతో తనను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లినందుకు ఆనందం తోపాటు కన్నీళ్లు కూడా వచ్చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనిషి అహకారంతో సాటి మనిషిని గౌరవించటం మరిచిపోయాడు. అంతస్థులను అంతరాలను చెరిపోస్తేనే ఆనందం అందుకోగలమని ఎప్పుడు అర్థమవుతుందో కదూ..!. కచ్చితంగా ఈ వీడియో కచ్చితంగా ఎందరికో కనువిప్పు కలుగుతుంది కదూ..!
కొంత మంది ఉంటారు.
కార్ కి చెయ్యి తగిలితేనే చిరాకు పడిపోతారు ఏదో అరిగిపోయినట్టు.
💞👍👏🙏 pic.twitter.com/hihCiV4Ewj— థింక్ బిగ్ (@BNR1974) August 9, 2024
(చదవండి: నోట్లో వేసుకుంటే కరిగిపోయే 'పైన్ నట్స్'..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment