వెనకటి తరంలో పిల్లలకు తండ్రి దగ్గర అంత చనువుండేది కాదు. వారికి ఏం కావాలన్నా అమ్మతో రికమెండ్ చేయించుకోవాల్సిందే. నాన్న వస్తున్నాడంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆపేసి వచ్చి పుస్తకాలు ముందరేసుకుని చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాళ్లు. అయితే ఆ తరం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు అమ్మ కన్నా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. తమకు కావలసిన వాటిని నాన్నతోనే అమ్మకు రికమెండ్ చేయించుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే చేస్తుంటారా?
నాన్నలుప్రాక్టికల్
చాలా విషయాలలో అమ్మలకన్నా నాన్నలు ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉంటారు.ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. చిన్నారుల చిన్ని జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, సవాళ్లనుప్రాక్టికల్‌గా ఏ విధంగా చూడాలో వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు. అంతేకాదు, దేనినైనా రెండు వైపుల నుంచి ఏ విధంగా ఆలోచించాలో తండ్రులే పిల్లలకు నేర్పుతారు.
నాన్న దగ్గరుంటే నిశ్చింత
పిల్లలకు ఏమైనా సమస్య అంటే తోటి పిల్లల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా నాన్నతో చెబుతా’ అని వారికి వార్నింగిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నాన్నే హీరో. సర్వశక్తిమంతుడు. నాన్నకు చెబితే ఏ పని అయినా తేలిగ్గా అయిపోతుందని, దానికి తిరుగుండదని వాళ్ల భావన. అందుకే నాన్న వాళ్లకొక నిశ్చింత.
ఆటలు... పాటలు
చాలామంది నాన్నలు ... పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు. కొత్త కొత్త ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఆడడంలో మెలకువలు చెప్పి సాయం చేస్తుంటారు. అమ్మలతో పోల్చితే ఆటల విషయంలో ఆంక్షలు తక్కువ. తమని ఒంటరిగా పంపడానికి భయపడుతుంటే స్కూల్‌లో టీచర్లు ప్లాన్ చేసే టూర్లకు, ఎక్స్‌కర్షన్లకు అమ్మలకు నచ్చజెప్పి ఒప్పించి మరీ వాళ్లకు కావలసినంత పాకెట్ మనీ ఇచ్చి సాగనంపుతారు.
ఆంక్షలు తక్కువ
అమ్మతో పోల్చితే నాన్న దగ్గర ఆంక్షలు తక్కువ... ఉదాహరణకు అబ్బబ్బా.. ఆ షూస్ విప్పకుండా అలా లోపలికి వచ్చేస్తావెందుకు... ఛీ.. యూనిఫారమంతా ఇంకు పూసేసుకున్నావు... దీనిని బాగు చేసేదెలా? తీసుకెళ్లిన ఫుడ్డంతా బుద్ధిగా తినకపోయావో.... ఇంకేం లేదు.. ఈ ఎగ్జామ్స్‌లో మార్కులు తక్కువ వస్తే ఊరుకోను... ఇటువంటి ఆంక్షలు నాన్నల దగ్గర ఉండవు.
నాన్నంటే ఓ సాహసం
పిల్లలకు నాన్నంటే నిజంగా ఓ అడ్వెంచర్. గోడలెక్కడం, చెట్లెక్కడం, గంతులు పెట్టడం... సైకిల్ మీద సవారీలు, కారు, బైకు డ్రైవింగ్ నేర్పించడం... ఇలా కొత్తగా ఏదైనా చెయ్యడం... లాంటివాటికి నో చెప్పక సై అంటారు.
తండ్రితో తీపి జ్ఞాపకాలు
సెలవులొస్తే బయటికి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, సినిమాలకు, జూలకి తీసుకెళ్లడం, కోరిన చోటుకు తీసుకెళ్లి దిగబెట్టి రావడం... ఇలాంటి జ్ఞాపకాలెన్నో తండ్రులతో బిడ్డలకు ముడిపడి ఉంటాయి. అందువల్ల నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం.
నాన్న... నవ్వురస భరితం
చాలామంది తండ్రులు పిల్లలతో హాయిగా జోకులు వేస్తుంటారు. లేదంటే చిన్న చిన్న కామెడీ సీన్లు కూడా సృష్టిస్తుంటారు. ఏం చేసినా, పిల్లలు హాయిగా నవ్వుకునేలా చేస్తారు. గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని తమ జోకులు, కామెడీ సీన్లతో తేలిగ్గా మార్చేసి, నవ్వుల పువ్వులు విసురుతారు.
రోల్ మోడల్స్
పిల్లలందరికీ నాన్నలే వాళ్ల రోల్ మోడల్. జీవితంలో ఎదురయే సమస్యలు, సవాళ్లను తట్టుకుని దృఢంగా ఎదిగే నాన్నలు తమను తాము రోల్‌మోడల్స్‌గా మలచుకుంటారు. పిల్లలతో గాఢానుబంధాన్ని ఏర్పరుచుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా ఎలా నెరవేర్చుకోవాలో పిల్లలకు నేర్పకనే నేర్పుతారు.
ఇక్కడ మనం నాన్న గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం... అలా అని అందరి నాన్నలూ అలా ఉండకపోవచ్చు. ఉండాలనీ ఏం లేదు. కాకపోతే పూర్వం కన్నా పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఇప్పటికాలం పిల్లలు నాన్నలతో ఫ్రీగా ఉంటున్నారు. నాన్నలు కూడా గాంభీర్యాన్ని విడిచిపెట్టేశారు. నాన్నలతో గాఢమైన బంధం ఉండే కూతుళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అమ్మలను రోల్‌మోడల్స్‌లా తీసుకునే కొడుకులూ ఉన్నారు.
తండ్రి వస్తుంటే... చేస్తున్న చిలిపి పనులు ఆపేసి తటాలున తలుపు చాటున దాక్కునే పిల్లలు ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. తండ్రులు కూడా పిల్లలకేసి ఉరిమి చూడటం లేదు. పిల్లల అల్లరిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమతో ్రపోత్సహిస్తున్నారు
భారతీయ యోగాకు పెద్దపీట
అమెరికా వ్యాప్తంగా దాదాపు 6,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఇవి అమెరికా సంయుక్త దేశాల రెస్టారెంట్ మార్కెట్‌లో దాదాపు 1 శాతం వాటాను ఆక్రమించడం విశేషం. ఇక మిషెలిన్ గైడ్ రెస్టారెంట్లలో భారతీయ రుచులను కోరుకుంటున్న వారు మూడు శాతంపైనే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
భారతీయ యోగా... యోగులు, రుషులు మనకందించిన అపూర్వ విజ్ఞానమిది. ఇప్పుడీ విజ్ఞానం విదేశీయులను విస్మయపరుస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యాల సాధనకు దీన్ని మించిన సాధనం లేదని పాశ్చాత్యులు భావిస్తున్నారు. 2023 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మొత్తం యోగా స్టూడియోల సంఖ్య 36,000 పైమాటే!
అమెరికాలో లాయర్లో 1.3 శాతం మంది, జర్నలిస్టుల్లో దాదాపు మూడుశాతం మంది భారతీయ సంతతికి చెందినవారే.
డాలర్లు కురిపిస్తున్న ఇండియన్ సినిమాలు
2015 నుంచి 2023 మధ్య వివిధ బాషలకు చెందిన 96 భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలయ్యాయి. నార్త్‌కరోలినాప్రాంతంలో ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఈ కారణంగానే ఇక్కడ విడుదలైన ఒక్కో సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తక్కువ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా చూస్తే వీటివిలువ 340 మిలియన్ల అమెరికన్ డాలర్లు
స్పెల్ బీ లోనూ మన కూనలదే హవా
స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో భారతీయ సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఆ ఏడాది విజేత బృహత్ సోమ సహా భారతీయ సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఈ పోటీల్లో 2000 నుంచి 2023 వరకూ మొత్తం 34 మంది విజేతలుగా నిలవగా వారిలో 28 మంది మన విద్యార్థులే కావడం మనందరికీ
గర్వకారణం.
Comments
Please login to add a commentAdd a comment