కొందరూ రాత్రి పడుకునేటప్పుడూ చక్కగా ముఖం కడుక్కుని పడుకుంటారు. ఇలా చేయడం మంచిదా? కాదా? . మరికొందరూ మాత్రం రాత్రిపూట ముఖం కడిగితే ఎక్కడ నిద్రపట్టదనో అస్సలు కడగరు. ఫ్రెష్‌నెస్ ఉంటే ఇంక నిద్ర ఏం వస్తుందని అనే వారు ఉన్నారు. అసులు ఇది ఎంతవరకు మంచిది. అలాగే కొందరు దగ్గర దుర్గంధం వస్తుంది. ఎన్ని ఫెరఫ్యూమ్‌లు వాడిన ఆ దుర్వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటి వాళ్లు ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదో తెలుసుకుందాం.
రాత్రి సమయంలో ముఖం కడగొచ్చా..
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం మరింత కాంతిమంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి.
- సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, కాటన్ వస్త్రంతో తడిలేకుండా తుడిచి ఆ తరువాత పడుకోవాలి.
- రోజూ పడుకునేముందు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన మురికి, మట్టి వదిలి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
- చర్మం మీద ఉండే సూక్ష్మ రంధ్రాలు చక్కగా శ్వాసిస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గి చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది మొటిమల ముప్పు తగ్గుతుంది.
- పడుకునే ముందు ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారకుండా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వారు రోజూ పడుకునేముందు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చర్మం మీద ముడతలు, కాలిన గాయాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్,గీతలు, మచ్చలు తగ్గాలంటే పచ్చి బంగాళాదుంపను తురిమి ముఖం మీద ప్యాక్‌వేయాలి లేదా మర్దన చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెల రోజులుచేస్తే మంచి ఫలితం ఉంటుంది.
శరీరం దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలంటే..
- స్నానం చేసే నీటిలో పటికముక్కలను వేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం తరువాత శరీరాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా స్నానం చేస్తే రోజంతా దుర్వాసన లేకుండా తాజాగా ఉంటారు. వీలైతే రాత్రంతా పటికను నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే మరీ మంచిది.
- అరటిపండు, బ్రకోలి, సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో అధికంగా చేర్చుకుంటే... చర్మం జిడ్డుతనం తగ్గి ఆరోగ్యంగా తయారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment