late night
-
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్‌కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా?
కొందరూ రాత్రి పడుకునేటప్పుడూ చక్కగా ముఖం కడుక్కుని పడుకుంటారు. ఇలా చేయడం మంచిదా? కాదా? . మరికొందరూ మాత్రం రాత్రిపూట ముఖం కడిగితే ఎక్కడ నిద్రపట్టదనో అస్సలు కడగరు. ఫ్రెష్‌నెస్ ఉంటే ఇంక నిద్ర ఏం వస్తుందని అనే వారు ఉన్నారు. అసులు ఇది ఎంతవరకు మంచిది. అలాగే కొందరు దగ్గర దుర్గంధం వస్తుంది. ఎన్ని ఫెరఫ్యూమ్లు వాడిన ఆ దుర్వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటి వాళ్లు ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదో తెలుసుకుందాం. రాత్రి సమయంలో ముఖం కడగొచ్చా.. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం మరింత కాంతిమంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి. సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, కాటన్ వస్త్రంతో తడిలేకుండా తుడిచి ఆ తరువాత పడుకోవాలి. రోజూ పడుకునేముందు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన మురికి, మట్టి వదిలి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ఉండే సూక్ష్మ రంధ్రాలు చక్కగా శ్వాసిస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గి చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది మొటిమల ముప్పు తగ్గుతుంది. పడుకునే ముందు ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారకుండా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వారు రోజూ పడుకునేముందు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చర్మం మీద ముడతలు, కాలిన గాయాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్,గీతలు, మచ్చలు తగ్గాలంటే పచ్చి బంగాళాదుంపను తురిమి ముఖం మీద ప్యాక్వేయాలి లేదా మర్దన చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెల రోజులుచేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరం దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలంటే.. స్నానం చేసే నీటిలో పటికముక్కలను వేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం తరువాత శరీరాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా స్నానం చేస్తే రోజంతా దుర్వాసన లేకుండా తాజాగా ఉంటారు. వీలైతే రాత్రంతా పటికను నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే మరీ మంచిది. అరటిపండు, బ్రకోలి, సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో అధికంగా చేర్చుకుంటే... చర్మం జిడ్డుతనం తగ్గి ఆరోగ్యంగా తయారవుతుంది. (చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!) -
లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ) పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్‌స్టామార్ట్.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది. (షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?) 3 గంటల వరకు.. ‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సందేశాలు పంపించింది. జూన్ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్‌స్టామార్ట్ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు. జెప్టో సైతం.. ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సేవలు ఆఫర్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే ప్రశ్నగా పేర్కొన్నాయి. -
Night Sleep: 10–11 గంటల మధ్యే ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు. రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్ ఇన్ డిజిటల్ ఎకానమీ ఎట్ ఎక్సెటెర్ (ఇండెక్స్), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. శరీరంలో గడియారం! మన శరీరంలో అంతర్గతంగా 24 గంటల గడియారం (సిర్కాడియన్ రిథమ్) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ పరిశీలన నిర్వహించారు. వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్ (రిస్ట్‌వార్న్ అక్సిలరోమీటర్) ఆధారంగా పర్యవేక్షించారు. వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు. ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 25 శాతం అధికం ►రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం. ►రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల ►రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం ►మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం ►రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది. ►అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం. మరణాలు నిర్ధారణ కాలేదు అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్‌కు చెందిన సీనియర్ లెక్చరర్ డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ స్పష్టం చేశారు. -
ఆలస్యపు నిద్రతో అనారోగ్యం!
న్యూయార్క్: ఆలస్యం.. అమృతం.. విషం.. అంటారు. అయితే నిద్రపోయే విషయంలో ఆలస్యం అమృతం కానేకాదని.. కచ్చితంగా విషమేనని అంటోంది తాజా అధ్యయనం. ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల బరువు పెరుగుదల విషయంలో ఇది అక్షరాలా నిజమని పేర్కొంది. ఆలస్యంగా నిద్రపోయే అమ్మాయిల్లో బరువు పెరిగే ప్రమాదం అధికమని తేల్చి చెప్పింది. న్యూయార్క్‌లో జరిపిన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల జామా పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న 418 మంది బాలికలు, 386 మంది మగపిల్లలను ప్రశ్నించారు. నిద్రకు సంబంధించిన అలవాట్లను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాన్ని పిల్లల చేతి మణికట్టుపై అధ్యయన కాలంలో ధరించారని అమెరికాలోని ఆరోగ్య సంస్థ కైసర్ పర్మనెంట్ పరిశోధకులు తెలిపారు. అనంతరం డ్యూయల్ ఎక్స్‌రే అబ్సార్ప్షియోమెట్రీ విధానాన్ని ఉపయోగించి పిల్లల శరీరంలోని కొవ్వు నిష్పత్తిని కొలిచారు. అదేవిధంగా పిల్లల నడుము పరిమాణాన్ని రికార్డు చేశారు. వీటితో పిల్లల సోషల్ మీడియా వాడటం వల్ల వారంపాటు నిద్రపోయే సమయంలోనూ, వారాంతాల్లో నిద్రపోయే సమయంలోనూ తేడాని సైతం గమనించారు. వారం రోజుల్లో కన్నా, వారాంతంలో ఆలస్యంగా నిద్రిసున్న వారిలో సామాజిక మాద్యమాల వాడకం వల్ల వచ్చే బద్ధకం (సోషల్ జెట్లాగ్) ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించే యుక్తవయసు బాలికల నడుము చుట్టుకొలతలు 0.58 సెంటీమీటర్లు అధికంగా ఉన్నాయని, వారి శరీరంలో 0.16 కిలోగ్రాముల కొవ్వుపెరిగినట్లు అధ్యయనంలో తేలింది. గంట గంటకీ పెరిగే కొవ్వు.. ప్రతి గంట సోషల్ జెట్లాగ్ కారణంగా యుక్తవయసు బాలికల్లో 1.19 సెంటీమీటర్ల మేర నడుము కొలత, శరీరంలోని కొవ్వు 0.45 కిలోగ్రాములు పెరుగుతున్నట్టు వెల్లడైంది. బరువు పెరుగుదలకు కారణమయ్యే ఇతర అంశాలైన నిద్రించే సమయం, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, టీవీ చూసే సమయం తదితర అంశాలను వేరుచేసినప్పటికీ నడుము కొలతల్లోనూ, కొవ్వు శాతంలోనూ తేడా అలాగే కొనసాగినట్లు తేలింది. అయితే అబ్బాయిల్లో సైతం కొన్ని తేడాలు గమనించినప్పటికీ అవి అంతగా చెప్పుకోదగినవి కావని వెల్లడించింది. అందుకే నిర్దిష్టంగా నిద్రపోవడం వల్ల బాల్యంలోనూ, యవ్వనంలోనూ వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చని అధ్యయనకారులు సూచిస్తున్నారు. -
లేట్‌నైట్‌లో హీరోహీరోయిన్లు.. ఫోటోలు హల్చల్
అర్ధరాత్రి హీరోహీరోయిన్లు ముచ్చటించుకుంటున్న ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ యూత్ స్టార్ రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియాభట్‌లు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహర్ ‘బ్రహ్మస్త్ర’ ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడు సింగిల్‌గా ఉండను. ఇప్పుడూ అంతే’ అంటూ అలియాతో ఉన్న రిలేషన్ గురించి పరోక్షంగా స్పందించాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి బంధం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ ఇలా ఒకే చోట.. అది కూడా రాత్రి పూట కావటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మీడియా అత్యుత్సాహం... వీళ్లిద్దరి తాజా కలయికపై బాలీవుడ్ మీడియా ఛానెళ్లు విపరీతమైన అర్థాలతో కథనాలను ప్రచురించాయి. అయితే సంజు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రణ్‌బీర్.. శుక్రవారం రాత్రి అలియా ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ ఈవెంట్లో రణ్‌బీర్-అలియాతోపాటు దర్శకదిగ్గజం-అలియా తండ్రి మహేష్ భట్ కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ బాల్కనీలో ఉన్న వీళ్లిద్దరి ఫోటోలను మాత్రమే హైలెట్ చేస్తూ కథనాలతో మీడియా ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. -
మీరేంటో చెప్పే లేటు నిద్ర
లండన్: మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? అర్ధరాత్రి పన్నెండూ ఒకటి దాటితేగాని పడుకోరా? ఈ అలవాట్లే మీ ప్రవర్తన గురించి తెలియజేస్తాయట. మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో వెల్లడిస్తాయట. బుద్ధిగా రాత్రి తొమ్మిదీ పదింటికే బెడ్డెక్కి దుప్పటి కప్పేవారి కన్నా నిత్యం లేటుగా నిద్రకు ఉపక్రమించేవారి సోషల్ నెట్వర్కే పెద్దదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నెట్‌వర్క్‌లో ఎక్కువగా ఉండేది కూడా ఇలాంటి వారేనట. పైగా వీరి కేంద్రంగానే ఈ చాటింగులూ మీటింగులూ జరుగుతాయని పరిశోధనలో వెలుగుచూసింది. ‘మనం డైలీ ఎంత సేవు ఫోన్ వాడతాం? ఎక్కువగా ఎవరికి కాల్స్ చేస్తుంటాం? ఎన్ని గంటలు మాట్లాడతాం? అనే విషయాలను బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చని ఫిన్లాండ్లోని ఆల్టో వర్సిటీకి చెందిన తలాయే అలేదావుడ్ అనే పరిశోధకుడు అంటున్నారు. మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన తీరుతెన్నులపై ఈయన అధ్యయనం చేస్తున్నారు. ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌ల టైమింగ్స్, సోషల్ నెట్వర్క్ పరిధిని బట్టి వ్యక్తుల సామాజిక అలవాట్ల గురించి చెప్పొచ్చని, ఇలా కచ్చితమైన సమాచారాన్ని సర్వేల ద్వారా పొందడం కష్టమని వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు వ్యక్తుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ‘మధుమేహం, కణితులు వంటి వాటిని గుర్తించేందుకు బయోమార్కర్లు ఉన్నాయి. కానీ మానసిక రుగ్మతలను కచ్చితంగా కనుగొనేందుకు పరికరాలు గానీ వైద్య పద్ధతులు గానీ లేవు. అందువల్ల ఈ మేరకు కొత్త మార్గాలను అన్వేషించాలి. నిద్రకు ఉపక్రమించే వేళల్లో క్రమరాహిత్యం ఉందంటే వాళ్లు ఏవో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు తమ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే వైద్యులను సంప్రదించేలా చూడటమే మా లక్ష్యం’అని అలేదావుడ్ వివరించారు. -
తిరుపతిలో అర్థరాత్రి యువకుడి హత్య
-
అర్ధరాత్రి వేళల్లో ఆత్మహత్యలే అధికం!
న్యూయార్క్: మనిషి తన జీవి తాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారా సూసైడ్ అంటారు. సాధారణ పరిభాషలో ఆత్మహత్య ధోరణి(సూసైడల్ టెండెన్సీ ) అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధుల కోవలోకే వస్తాయి. అసలు ఆత్మహత్యలు అధికం కావడానికి మాత్రం ప్రధాన కారణం నిద్రలేమి సమస్యలేనని తాజా సర్వేలో వెల్లడైంది. దీనిపై ఫిలాడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ ఒక పరిశోధన నిర్వహించిది. ఇందుకు గాను ఆత్మహత్య చేసుకున్న 35,332 మంది జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో అర్ధరాత్రి తర్వాత 10.27 శాతం మంది ఆత్మహత్యలు చేసుకోగా, రెండు గంటలు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వారి శాతం 16.27 గా నమోదైంది. ఇదిలా ఉండగా ఉదయం 6 గం.ల నుంచి 11గం.ల ప్రాంతంలో మాత్రం 2.3 శాతంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి కారణం మాత్రం అర్ధరాత్రి పూట పార్టీలకు హాజరై తగినంత నిద్ర లేకపోవడమేనని యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ పెర్లిస్ స్పష్టం చేశారు. నిద్రలేమి సమస్య కారణంగానే రాత్రి వేళల్లో ఆత్మహత్యలు అధికమవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.