ఎన్నో రకాల క్యాన్సర్‌ల గురించి విన్నాం. కానీ ముక్కు క్యాన్సర్‌గా గురించి విని ఉండం. ఐతే ఇది ఎందువల్ల అనేది? కారణాలు తెలియాల్సి ఉంది. గానీ దీని కారణంగా పలువురు పేషెంట్లు ముక్కును కోల్పోయారు. తాజాగా బ్రిటన్‌కి చెందిన ఓ మహిళా ఇలానే మొత్తం ముక్కును కోల్పోయింది. అసలేంటి ముక్కు క్యాన్సర్? వస్తే మొత్తం ముక్కునే తొలగించక తప్పదా..?
ముక్కు లోపాల కణితి వచ్చి అసాధారణంగా పెరగడం ప్రారంభమైతే దాన్ని ముక్కు క్యాన్సర్ లేదా నాసికా క్యాన్సర్ అంటారు. వీటిలో రకాలు కూడా ఉంటాయి. కణ క్యాన్సర్, అడెనోకార్సినోమా, న్యూరోబ్లాస్టోమా, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, సార్కోమా తదితరాలు. ఇది నాసికా కుహరం లేదా పారానాసల్ లోపల ప్రారంభమయ్యే స్థితిని బట్టి ముక్కుకి సంబంధించిన ఆ రకమైన క్యాన్సర్‌లుగా నిర్థారిస్తారు వైద్యులు.
ఈ వ్యాధి బారిన బ్రిటన్‌కి చెందిన 40 ఏళ్ల టీనా ఎర్ల్స్ పడింది. ఆమె ఐదుగురు పిల్లల తల్లి. ఆమె తరుచుగా ముక్కు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండేది. ముఖం ఎడమవైపు మొద్దబారిపోతున్నట్లు ఉండేది. లోపాల ఒక విధమైన గడ్డ ఉండి నొప్పి వచ్చేది. సాధారణంగా ముక్కులో వచ్చే గడ్డలనే ఆమె భావించింది. తరచుగా ముక్కు రక్తస్రావం అయ్యేంది కూడా. ఇక ఈ బాధను భరించలేక వైద్యలను సంప్రదించింది టీనా. అక్కడ తాను ముక్కుకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది.
రెండో దశలో ఉందని సత్వరమే రెడియోథెరఫీ వంటి చికిత్సలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఈ చికిత్సలో ముక్కును తొలగించక తప్పదని కూడా చెప్పారు. దీంతో టీనా ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రాణాలు నిలబడాలంటే టీనా ఆ ట్రీట్‌మెంట్ తీసుకోక తప్పలేదు. చికిత్సలో భాగంగా టీనా ముక్కును తొలగించారు వైద్యులు. ముక్కు లేకపోవడం కారణంగా గొంతు తడిగా ఉండకుండా పొడబారిపోతుంది. అందుకోసం ప్రోస్టేటిక్స్‌తో తయారు చేసిన ముక్కు లేదా మరేదైన రక్షణ కవచాన్ని ధరించాల్సి ఉంటుంది.
అయితే ఆమెకు కృత్రిమ ముక్కు అసౌకర్యంగా ఉండటంతో క్లాత్ మాదిరి గాజును ధరించి బయటకు తిరిగేది. అంతేగాదు ఈ పరిస్థితి కారణంగా జీవితాంతం ట్యూబ్ ద్వారే ఆమెఆహారాన్ని స్వీకరించాల్సి ఉంది. ఇన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా టీనా పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న కృతనిశ్చయంతో ఉండటం విశేషం. తన ముఖాన్ని చూసి ఎవరైనా కామెంట్ చేసినా వాటిని ఎదుర్కొనగలను, ఇదివరకటి టీనాలా కాకుండా మరింత స్ట్రాంగ్‌గా ఉంటానని నమ్మకంగా చెప్పింది.
ఎవరికీ వస్తుందంటే..
నిపుణులు అభిప్రాయం ప్రకారం 55 ఏళ్ల పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధూమపానం, కలప, తోలు దుమ్ము, వంటి వాటికి సంబధించిన వృత్తులు చేసే వారికి ఈ నాసికా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కారణం..
కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులు దెబ్బతిన్నప్పుడు లేదా అసాధారణంగా మారినప్పుడు కణితులు ఏర్పడతాయి. ఈ జన్యు మార్పులు ఎందుకు సంభవిస్తాయో ఇప్పటి వరకు నిపుణులకు కచ్చితమైన కారణాలు తెలయరాలేదు.
లక్షణాలు..
- దీర్ఘకాలిక ముక్కు సమస్య లేదా సైనస్
- వాసన కోల్పోవడం
- ముక్కు నుంచి రక్తం కారడం
- తలనొప్పులు
- తరుచుగా ముక్కు కారిపోవడం(జలుబు)
- నీళ్ళు నిండిన కళ్ళు
- ముక్కు, కళ్ళు, చెవులు బుగ్గల చుట్టూ నొప్పి
- ముక్కు, ముఖం, మెడ లేదా మీ నోటి పైభాగం పెరుగుదల
- దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు
- వినికిడిలో ఇబ్బంది
- అస్పష్టమైన దృష్టితో కూడిన కంటి సమస్యలు
(చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?)
Comments
Please login to add a commentAdd a comment