అతిపెద్ద ప్రాసాదం ఎక్కడుందో తెలుసా? | Forbidden City Was Most Famous World Heritage In China | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ప్రాసాదం ఎక్కడుందో తెలుసా?

Published Sun, Jan 8 2023 10:50 PM | Last Updated on Sun, Jan 8 2023 10:52 PM

Forbidden City Was Most Famous World Heritage In China - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్‌బిడెన్‌ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్‌ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్‌వు చక్రవర్తి కొడుకు ఝు డి నాన్‌జింగ్‌ నుంచి బీజింగ్‌కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు.

దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement