సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల ధర్నా
కొరిటెపాడు: ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) తరఫున బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ గుంటూరు మాడ్యూల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి తెలిపారు. సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లు, జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌బీఐ గుంటూరు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్‌లు బ్యాంకులోని అన్ని విభాగాలలో తగిన రిక్రూట్మెంట్, వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రీజినల్ సెక్రటరీ కె.ఆర్.వి.జయ కుమార్, యు.ఎఫ్.బి.యు. అడ్వైజర్ పి.కిషోర్, ప్రెసిడెంట్ ఇ.రవిచంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ మహమ్మద్ సయ్యద్‌బాషా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ సెక్రటరీ ఎం.రాంబాబు, బెఫీ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు పాల్గొన్నారు.
24 నుంచి బ్యాంకుల సమ్మెకు నేతల పిలుపు
Comments
Please login to add a commentAdd a comment