ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోలింగ్ సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల విధులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణలో భాగంగా బ్యాలెట్ బాక్సుల పరిశీలన గురించి వివరించారు. సమావేశంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.కరుణ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
ప్రిసైడింగ్ అధికారులకు సూచనలు
అనంతరం కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి విధుల గురించి అవగాహన కల్పించారు.
26న మల్లయ్య గట్టుకు లాంచీలు
విజయపురి సౌత్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన మాచర్ల మండలం అనుపు నుంచి ఏలేశ్వరస్వామి ఆలయానికి (మల్లయ్య గట్టుకు) ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీలను నడపనున్నట్లు లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా తెలిపారు. శుక్రవారం విజయపురి సౌత్‌లోని లాంచీ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుపు నుంచి ఆ రోజు ఉదయం 7 – మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. టికెట్ ధరను పెద్దలకు రూ.200, ఐదేళ్లు దాటిన పిల్లలకు రూ.150గా నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment