ఇంటర్ దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియెట్ దూరవిద్య పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులను శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ, ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాలలో 2,117 మంది పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment