వైభవం.. ధ్వజారోహణం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసినయున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం రాత్రి 8 గంటలకు ఋత్వికరణ, అంకురారోపణాధి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతల ఆహ్వానానికి భక్తాగ్రేసరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ధ్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు.
నేడు హనుమంత వాహనంపై..
లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
నృసింహుడి కల్యాణానికి
దేవతలకు ఆహ్వానం
వైభవం.. ధ్వజారోహణం
Comments
Please login to add a commentAdd a comment