హద్దులు దాటుతున్న ఇసుక | - | Sakshi
Sakshi News home page

హద్దులు దాటుతున్న ఇసుక

Published Tue, Mar 25 2025 2:23 AM | Last Updated on Tue, Mar 25 2025 2:18 AM

కొల్లూరు: కూటమి నేతలు ఇసుకను అక్రమ మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంట సాల మండలం శ్రీకాకుళం ప్రాంతంలో ఉచిత ఇసుక క్వారీ ఉంది. ఇసుకను భారీ లారీలలో నింపి దొడ్డిదారిలో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కు అక్రమంగా తరలిస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామాల నడుమ వ్యవసాయ కార్యకలాపా లు, ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గాలు మార్గం వారి అక్రమాలకు రాచమార్గంగా మారింది. రోజుకు 100 ఇసుక లారీలు అక్రమంగా తరలివెళుతున్నాయి.

బిల్లులు నిల్‌

నిబంధనల మేరకు రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇతర జిల్లాల్లోకి బిల్లులతో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కూటమి నాయకులు బిల్లులు లేకుండానే బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లా లకు ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు.

పట్టించుకోని యంత్రాంగం

కృష్ణా జిల్లా నుంచి నదిలోని గాలు మార్గం ద్వారా బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా జిల్లాలోకి వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక సంఖ్యలో వాహనాలు గాజుల్లంక, పెసర్లంక, కొల్లూరు, పోతార్లంక, దోనేపూడి, కిష్కిందపాలెం, తోకలవారిపాలెం మీదుగా తరలివెళుతున్నా యి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ శాఖల అధికారులు మాత్రం స్పందించడంలేదు. పెసర్లంక–కొల్లూరు రహదారి పనులు జరుగుతున్న తరుణంలో ఇసుక లారీల నుంచి కారుతున్న నీరు కారణంగా రోడ్డు మన్నిక ప్రశ్నార్ధకంగా మారుతుంది.

కూలీల కడుపుకొడుతున్నారు

ఉచిత ఇసుక క్వారీలలో తవ్వకాలకు కూలీలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనకు తూ ట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగిస్తున్నారు. నదిలో ట్రాక్టర్లు దిగి కూలీల తో ఇసుక నింపకుండా గుంతలు తీసి అడ్డుకుంటు న్న అధికారులు పక్క జిల్లా నుంచి అక్రమ మార్గంలో ఇసుకరవాణా జరుగుతున్నా పట్టించుకోలేదు.

కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక క్వారీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు తరలింపు గాలు రోడ్డే అక్రమాలకు మార్గం పట్టించుకోని అధికారులు

పరిశీలించి చర్యలు

నదిలో అక్రమ మార్గం ద్వారా జిల్లాలోకి ఇసుక రవాణాను అరికట్టే విషయంలో రూల్స్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్‌ శాఖాధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి కృష్ణా నదిలో జిల్లా దాటి బిల్లులు లేకుండా వాహనాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తాం.

– బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌, కొల్లూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement