అమరావతిలో మంత్రి నారాయణ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం పర్యటించారు. రాయపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాలను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. ఈ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.43 వేల కోట్లతో గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. మొదట రాజధానిలో క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఇప్పుడు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు పరిశీలించినట్టు పేర్కొన్నారు. 186 బంగ్లాలు, మంత్రులు, జడ్జిలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్‌జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని, హైకోర్టు 16.85 లక్షల చదరపు అడుగులు వస్తుందని, అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో అందుబాటులోకి రానుందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, ల్యాండ్ వాల్యూ పెరిగిన తరువాత అప్పు తీరుస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment