రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
తెనాలిరూరల్: రైలు ఢీకొని ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద చోటుచేసుకుంది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి ఆరో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దనబోయన రాఘవరెడ్డి(46) తనతో కలసి డ్యూటీలో ఉన్న సహచరులకు వారి ఇళ్ల నుంచి మంగళవారం భోజన క్యారేజీలను తీసుకెళ్లాల్సి ఉంది. 11 గంటల ప్రాంతంలో సహచరులకు ఫోన్ చేసి భోజనాలు సిద్ధమయ్యాయో లేదో కనుక్కుంటే తీసుకొస్తానని చెప్పాడు. కొద్ది సేపటికే ఇప్పటం రైల్వే గేటు వద్ద పట్టాల వెంబడి మృతి చెంది పడి ఉన్నాడు. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైలు ఢీకొట్టిందా లేక సడెన్‌గా రైలు రావడంతో పక్కకు జరిగే క్రమంలో కాలు జారి పడడంతో తల వెనుక భాగంలో గాయమై మృతి చెందాడా అన్న అంశాలు దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment