
గిట్టుబాటు ధర కల్పించాలి
నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు ఖర్చు చేశా. దిగుబడి 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితులు లేవు. వాటిలో సగం తాలు. ప్రస్తుతం 40 బస్తాలు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటా రూ.9 వేలు ధర పలికింది. గత ఏడాది మిర్చి క్వింటా ధర సుమారు రూ.27 వేల వరకు పలికింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ముడావత్ హిరా నాయక్, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, కల్వకుంట గ్రామం
ఆత్మహత్యలే శరణ్యం
నాలుగు ఎకరాల్లో 116 డీలక్స్ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది పది క్వింటాళ్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులో సగానికి పైగా తాలు వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టా. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికింది. ప్రస్తుతం 34 బస్తాలు యార్డుకు తీసువచ్చాను. క్వింటా కాయలకు రూ.10 వేలు వేశారు. రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మిర్చి అమ్ముకుని వెళ్ళాలంటే భయమేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలు, ఎరువులు, పురుగు మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవే ధరలు కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం
– పినికే వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా, పెద్ద అర్ధవీడు మండలం, తమ్మడపల్లె గ్రామం
●

గిట్టుబాటు ధర కల్పించాలి