శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025
అమ్మవార్లకు నిత్య పూజలు
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామదేవత గోగులమ్మకు గురువారం నిత్య పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎంలు, వీవీప్యాడ్స్ భద్రపరచిన గోడౌన్‌ను డీఆర్‌ఓ ఎన్.షేక్ ఖాజావలి గురువారం తనిఖీ చేశారు.
శ్రీ మడేలేశ్వర స్వామికి బోనాలు
గురజాల: మండలంలోని పులిపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మడేలేశ్వర స్వామికి గురువారం భక్తులు బోనాలు సమర్పించారు.
జిల్లావ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగరేసింది. ప్రజల్లో తన బలాన్ని చాటింది. కుట్రలు కుతంత్రాలు, పోలీసులతో బెదిరింపులు, డబ్బులతో సత్తా చాటాలని చూసిన కూటమి నేతలకు భంగపాటు ఎదురైంది. కూటమి నక్క జిత్తులను
వైఎస్సార్ సీపీ నేతలు ఐకమత్యంతో అడ్డుకట్ట వేశారు. ప్రజా క్షేత్రంలో తమకు తిరుగు లేదని చాటి చెప్పారు. ఎంపీటీసీలను కొనుగోలు చేసి తమ ఆధిక్యతను నిరూపించుకోవాలని చూసిన కూటమి నేతలకు నిరాశే ఎదురైంది. ఐకమత్యంతో, కలసికట్టుగా వైఎస్సార్ సీపీ నేతలు వ్యవహరించడంతో కాల‘కూటమి’ నేతల పాచికలు పారలేదు.
ఇఫ్తార్ సహర్
(శుక్ర ) (శని )
గుంటూరు 6.25 4.49
నరసరావుపేట 6.27 4.51
బాపట్ల 6.25 4.49
స్థానిక సంస్థల ఎన్నికల్లో
వైఎస్సార్ సీపీ హవా
గుంటూరు రూరల్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గురువారం ఎన్నిక నిర్వహించేందుకు మండల స్పెషల్ ఆఫీసర్ వజ్రశ్రీ, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు ఆదేశాలను జారీ చేశారు. దీంతో రూరల్ మండలంలో వైస్ ఎంపీపీ పదవి కోసం కూటమి, వైఎస్సార్ సీపీలు పోటాపోటీగా తలపడ్డాయి. కూటమికి చల్లావారిపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవగా, జొన్నలగడ్డకు చెందిన ఎంపీటీసీ ఒకరు ఉన్నారు. ఇద్దరితో బలం సరిపోక కూటమి నేతలు కుట్రలకు తెరతీశారు. బెదిరింపులు, డబ్బుతో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఒక ఎంపీటీసీని కలుపుకున్నారు. దీంతో కూటమికి బలం మూడుకు పెరిగింది. మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో ఐదు స్థానాలను వైఎస్సార్ సీపీ కై వశం చేసుకుంది. ఈ నేపథ్యంలో కూటమి కుట్రలకు ఒక ఎంపీటీసీ పార్టీ మారగా వైఎస్సార్ సీపీ విప్ జారీ చేసింది. ఒక ఎంపీటీసీని కోల్పోయినప్పటికి నాలుగు స్థానాలతో వైఎస్సార్ సీపీ ఏకగ్రీవంగా వైస్ ఎంపీపీ స్థానాన్ని కై వశం చేసుకుంది.
తోక ముడిచిన కూటమి నేతలు
ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నారు. కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసి, బెదిరించి మండల పరిషత్ కార్యాలయానికి తెచ్చారు. ఎలాగైనా ఒక ఎంపీటీసీనైనా కిడ్నాప్ చేసి, ఎన్నిక జరగకుండా చేయాలని లేదా డ్రా చేయాలని ప్రయత్నాలు చేశారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బెదరలేదు. అంతా మండల పరిషత్‌లోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎన్నికల కేంద్రానికి చేరుకోవడంతో కూటమి నేతలు అక్కడినుంచి జారుకున్నారు. కనీసం ఉన్న ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఎన్నికకు హాజరవ్వకుండా తోకముడిచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నిక జరిగిందిలా....
వైఎస్ ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల అధికారిగా, మండల స్పెషల్ ఆఫీసర్ ఎల్. వజ్రశ్రీ వ్యవహరించారు. ఉదయం 11 గంటలకు వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలు ఎంపీపీ ఇంటూరి పద్మావతి, వైఎస్ ఎంపీపీ దర్శి సుజాత, పులగం దివ్య, కాకాని రమేష్, కోఆప్షన్ సభ్యుడు కరీముల్లాలు చేరుకున్నారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కాకాని రమేష్ నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం ఆయన్ను ఎంపీటీసీ, ఎంపీపీ ఇంటూరి పద్మావతి ప్రతిపాదించగా, ఎంపీటీసీ, వైఎస్ ఎంపీపీ దర్శి సుజాత బలపరిచారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం కూటమి నేతలు ఎన్నికకు హాజరుకాకపోవడం, కాకాని రమేష్ మాత్రమే నామినేషన్‌ను దాఖలు చేయడంతో ఎన్నికల అధికారి వజ్రశ్రీ అధికారికంగా ఏకగీవ్రంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికై న వైఎస్ ఎంపీపీ కాకాని రమేష్‌ను వైఎస్సార్ సీపీ నేతలు, మండల పరిషత్ అధికారులు అభినందించారు. ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.
● మాజీ ఎమ్మెల్యే శివకుమార్
● మండల పరిషత్ కో–ఆప్షన్
సభ్యుని ఏకగ్రీవ ఎన్నిక
తెనాలి: స్థానిక మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా తేలప్రోలుకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సయ్యద్ జానీబాషా ఏకగ్రీవ ఎన్నిక పార్టీ ఐక్యతకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికై న సయ్యద్ జానీబాషా, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పార్టీ ఎంపీటీసీలతో కలిసి గురువారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ను కలిశారు.
సయ్యద్ జానీబాషాను శివకుమార్ అభినందించి శాలువతో సత్కరించారు. జానీబాషా
ఏకగ్రీవ ఎన్నిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని బహిర్గతం చేస్తోందని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 18 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ, తాను ఓటమి చెందినప్పటికీ ఎంపీపీ, ఎంపీటీసీలు ఏకతాటిపై ఉండటంతో కో–ఆప్షన్ ఏకగ్రీవమైందని చెప్పారు. ఇందుకు కారకులైన ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీలను అభినందించారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రాజ్యాధికారంలో అన్ని సామాజికవర్గాలకు స్థానం కల్పించినట్టు చెప్పారు. తెనాలి నియోజకవర్గంలోనూ ఆ సామాజిక సమతుల్యతను పాటించామని శివకుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ ముందు చెప్పినట్టుగా, తేలప్రోలుకు చెందిన మైనారిటీ సోదరుడు జానీబాషాకు ఇచ్చామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుడి ఎంపిక అల్లా ఆశీర్వాదం అనుకుంటున్నామని అన్నారు. ఇదే తరహాలో భవిష్యత్‌లోనూ అంతా కలసికట్టుగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలపక్షాన పోరాడతామని శివకుమార్ స్పష్టం చేశారు. గత అయిదేళ్లలో పేదవాడికి గరిష్టంగా సంక్షేమం ఇచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తేలప్రోలు సర్పంచ్ షేక్ బాషా, ఎంపీటీసీలు షేక్ ఇలియాస్, దోసపాటి నాగదేవిక, కాలిశెట్టి వెంకట మారుతీఫణికుమార్, ఇసుకపల్లి సుందరరావు, సంకురు బుజ్జిబాబు, పఠాన్ ఖాసింఖాన్, షేక్ ముజీర్, షేక్ గాలబ్, షేక్ జానీ, షేక్ మస్తాన్, షేక్ నాగురా, షేక్ సలీం, షేక్ మున్నా, షేక్ సుభాని పాల్గొన్నారు,
I
న్యూస్‌రీల్
భవిష్యత్‌లోనూ ఐక్యంగా కొనసాగుతాం
గుంటూరు రూరల్ మండలం వైస్ ఎంపీపీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవం ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్‌కు ప్రయత్నించిన కూటమి నేతలు
పోలీసులతో బెదిరింపులు, డబ్బుతో కొనుగోలుకు యత్నం ఎత్తుకు పైఎత్తులతో ఏకగ్రీవంగా ఎన్నికై న వైఎస్సార్ సీపీ అభ్యర్థి
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు