గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గుంటూరు జిల్లా చైర్మన్‌గా కె. నరసింహారావు (ఏపీటీఎఫ్–1938), సెక్రటరీ జనరల్‌గా కె. వీరాంజనేయులు (ఎస్సీ, ఎస్టీ సంఘం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎం. కళాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఫ్యాప్టో కో–చైర్మన్లుగా బి. సత్యం (హెచ్‌ఎంఏ), షేక్ ఫైజుల్లా (డీటీఎఫ్), డెప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా యు. రాజశేఖర్‌రావు (యూటీఎఫ్), బి. సుబ్బారెడ్డి (ఎస్టీయూ), ఎండీ ఖాలీద్ (ఏపీటీఎఫ్–257)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఫ్యాప్టో నూతన కార్యవర్గం