తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళ శాసనాలతో విశ్వావసు నామ సంవత్సర ఉగాది నుంచి తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. ఉదయం హనుమ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రులకు అభిషేక మహోత్సవం అనంతరం పంచాంగ పఠనం, సుందరకాండ పారాయణ, అష్టోత్తర శతనామార్చన, సీతారామ చంద్రులకు కల్యాణ మహోత్సవం నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాల్లో పాల్గొని రామచంద్రుల ఆశీస్సులు పొందితీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు గమనించాలని జిల్లా ఎస్పీ కోరారు.
బంగారు గరుడోత్సవం
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం ఉదయం ఉగాది తిరువంజనోత్సవంతోపాటు స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం ఉగాది సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ పఠనం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామి బంగారు గరుడోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అద్దాల మహల్ పవళింపు సేవలో గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన నిర్వహించారు. ఆలయ ఈఓ రామకోటి రెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బంగారు గరుడోత్సవానికి కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన నందికంటి వెంకట హనుమాన్ ప్రసాద్ వ్యవహరించారు.
శివ లింగాన్ని తాకిన సూర్య కిరణాలు
దాచేపల్లి : మండలంలోని గామాలపాడులో సుప్రసిద్ధ మహా శైవ క్షేత్రంలోని శివలింగాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. సూర్యోదయం అయిన తరువాత దేవాలయం తలుపులు తీయగానే నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడ్డాయి. దీంతో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకుని, పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, సర్పంచ్ జంగా సురేష్ మహా శైవ క్షేత్రంలో పూజలు నిర్వహించారు. శివలింగాన్ని సూర్య కిరణాలు తాకడం అరుదైన ఘటన కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
వేంకటేశ్వరస్వామికి
కిరీటం బహూకరణ
గురజాల రూరల్ : నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామికి రూ.5లక్షల విలువైన బంగారు పూత కలిగిన వెండి కిరీటాన్ని నందేల పెద్ద సైదారెడ్డి, నాగమ్మ, చిన సైదారెడ్డి, కోటేశ్వరమ్మ ఆదివారం బహూకరించారు. కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అర్చకులకు అందజేశారు.
విజయ కీలాద్రిపై ఉగాది వేడుకలు
విజయ కీలాద్రిపై ఉగాది వేడుకలు
విజయ కీలాద్రిపై ఉగాది వేడుకలు