అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి ఆదివారం వేకువజామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఈవో సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామిని ఉంచి, శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ రంగాల్లో జరిగే పరిణామాలను వివరించారు. అనంతరం భక్తులందరికీ ఉచితంగా పంచాంగాలను పంపిణీ చేశారు.