కనిపించె ప్రగతికి స్వాగతం | - | Sakshi
Sakshi News home page

కనిపించె ప్రగతికి స్వాగతం

Published Tue, Apr 1 2025 11:33 AM | Last Updated on Tue, Apr 1 2025 3:45 PM

కనిపి

కనిపించె ప్రగతికి స్వాగతం

తెనాలి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కత్తెర కాన్పులు అధికమయ్యాయి. సాధారణ ప్రసవాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సమీక్షలో తేలిన అంశమిది. దీనిపై వైద్యాధికారులతో ఆస్పత్రుల్లో చేయించిన తనిఖీల్లో కఠోర వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నూటికి 98 శాతం ప్రసవాలు సిజేరియన్లతోనే జరిగాయి. అయితే తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 35 శాతం వరకు సాధారణ కాన్పులు చేయగలిగారు. గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలను సమీక్షించుకుంటే నిగ్గు తేలిన అంశమిది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తీసుకున్న ముందస్తు చర్యలు ఇందుకు దోహదపడ్డాయి.

ప్రసవాల తనిఖీ

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, తెనాలి ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఇటీవల పట్టణంలోని ఐదు ప్రైవేటు ఆస్పత్రులు, సమీపంలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలను తనిఖీలు చేశారు. ఆ ఆస్పత్రుల్లో నెలకు వంద వరకు ప్రసవాలు జరిగితే, అందులో రెండు మాత్రమే సాధారణ కాన్పులు. మిగిలిన 98 సిజేరియన్లే. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున నెలకు 200 ప్రసవాలు జరిగా యి. గత ఆర్నెల్లలో 1200పైగా ప్రసవాలు జరిగితే అందులో 444 కాన్పులు సాధారణమే. అంటే దాదాపు 35 శాతం. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ కాన్పులను ఎందుకు ప్రోత్సహించడం లేదని అధికారులు నిర్వాహకులను ప్రశ్నించారు. ఇకపై ఆదిశగా ప్రయత్నించాలని ఆదేశించారు.

సాధారణ ప్రసవాలపై గత ప్రభుత్వం దృష్టి

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా అందుకు అవసరమైన చర్యలను తీసుకుంది. ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్‌ను ఆధునికీకరించారు. పెయింట్‌ వేయించారు. ఏసీలు అందుబాటులోకి తెచ్చారు. లేబర్‌ రూంలో అవసరమైన టేబుల్స్‌ సమకూర్చారు. ఐదుగురు స్టాఫ్‌ నర్సులకు సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీటితోపాటు మహిళలకు గర్భిణి నిర్ధారణ కాగానే, రిజిస్ట్రేషన్‌ చేసి, కౌన్సెలర్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్సర్‌సైజులపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంపై డైటీషియన్‌ సూచనలు చేస్తున్నారు. ఓపీ హాలులోని టీవీలో ఎక్సర్‌సైజులు, ఆహారంపై ప్రసారాలు చేస్తు న్నారు. ప్రసవం దగ్గర పడే వరకు ఇలాంటి జాగ్రత్తలు కొనసాగిస్తున్నారు. నొప్పులు మొదలుకాగానే లేబర్‌ రూంకు తీసుకెళతారు. ప్రవస సేవలకు నలుగురు మెటర్నటీ అసిస్టెంట్లు, అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఇన్ని చర్యల కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులకు అవకాశం కలుగుతోంది.

తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 35 శాతం వరకు సాధారణ కాన్పులు గత ప్రభుత్వ చర్యలతో ఒనగూరిన ప్రయోజనం సాధారణ ప్రసవాలకు వైద్యులు కృషి ప్రైవేటు ఆసుపత్రుల్లో 98 శాతం సిజేరియన్లు తగ్గించాలని కమిటీ ఆదేశం

తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో

గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలు...

నెల ప్రసవాలు సిజేరియన్‌ సాధారణ

మొత్తం కాన్పులు కాన్పులు

అక్టోబరు 264 168 96

నవంబరు 276 165 111

డిసెంబరు 204 135 69

జనవరి 174 110 64

ఫిబ్రవరి 144 97 47

మార్చి 27వరకు 145 88 57

మొత్తం 1207 763 444

కనిపించె ప్రగతికి స్వాగతం1
1/1

కనిపించె ప్రగతికి స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement