
20 కిలోల గంజాయి స్వాధీనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాడీపేట 1/1వ లైన్‌లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం రాత్రి జరిగింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఏటి అగ్రహారానికి చెందిన పైర్ధ కిరణ్‌బాబు బ్రాడీపేట 1/1 లైన్‌లోని నగరపాలక సంస్థ సులబ్ కాంప్లెక్స్‌లో పని చేసే బిహార్‌కు చెందిన గుల్షన్‌కుమార్‌కు గంజాయి విక్రయించి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అరండల్‌పేట సీఐ వీరాస్వామి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌బాబు వద్ద బస్తాలో 20.620 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి కొనుగోలు చేసిన బిహార్‌కు చెందిన గుల్షన్ కుమార్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కిరణ్‌బాబుపై సుమారు 39కి పైగా గంజాయి, దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్‌బాబు డిసెంబర్‌లో బాపట్ల సబ్‌జైల్ నుంచి విడుదలై బయటకు వచ్చాడని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. కిరణ్‌బాబు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నాడు? నగరంలో ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.