
సంప్రదాయ కళలను ఆదరించడం అభినందనీయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): సంప్రదాయ కళలను ఆదరించడం అభినందనీయమని సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. కొరిటెపాడులోని ఎల్‌వీఆర్ అండ్ సన్స్ క్లబ్, రీడింగ్ రూమ్ ఆవరణలో ఆదివారం మురళీమోహన్ 52 ఏళ్ల కళారంగ ప్రస్థానం, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ప్రాంభమయ్యాయి. తొలుత ఉత్సవ కమిటీ చైర్మన్ ఘంటా పున్నారావు, ఎల్‌వీఆర్ క్లబ్ అధ్యక్షులు మైనేని బ్రహ్మేశ్వరరావు, కళావిపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కళాసౌధ నిర్వాహకులు బిళ్ళ అశోక్ బృందం మురళీగానంతో వీనుల విందు చేసింది. ముఖ్య అతిథి మురళీమోహన్ మాట్లాడుతూ ఈ సభలో ఉన్న అనేక మందితో మంచి సంబంధబాంధవ్యాలు ఉన్నాయన్నారు. నాటక రంగ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఎల్‌వీఆర్ క్లబ్‌ను, కా ట్రగడ్డ రామకృష్ణప్రసాద్ కృషిని అభినందించారు. అనంతరం గుమ్మడి గోపాలకృష్ణ, మహమ్మద్ అ హ్మద్ షరీఫ్‌లకు మురళీమోహన్ ఆత్మీయ పుర స్కారాలు అందించి, సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని రవికుమార్, ఎమ్మెల్యేలు గళ్లా మాధ వి, నసీర్‌అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొత్త సుబ్రహ్మణ్యం (కుమార్ పంప్స్), సినీ నిర్మాత నన్నపనేని సుధాకర్, ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటి వైస్ చైర్మన్ కాట్రగడ్డ ప్రసాద్, కళ్ళం సంస్థలు చైర్మన్ కళ్ళం మోహన్‌రెడ్డి, ఎన్‌టీఆర్ కళాపరిషత్ గుంటూరు గౌరవాధ్యక్షుడు అంబటి మధుమోహన్‌రెడ్డి, ఎన్‌టీఆర్ కళాపరిషత్ ఒంగోలు అధ్యక్షుడు ఈదర హరిబాబు పాల్గొన్నారు.
నాటకోత్సవాలు ప్రారంభం