
గుర్తుకొస్తున్నాయి..!
తాడేపల్లి రూరల్: గుంటూరు జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు ఉండవల్లి కరకట్ట సమీపంలోని రిసార్ట్‌లో ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రా నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జేకేసీ కళాశాలలో 1989–94 బ్యాచ్ డిగ్రీ, పీజీ విద్యార్థులు ఆత్మీయంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువున్న రోజుల్లో జరిగిన సంఘటనలను, అనుభవాలను పంచుకున్నారు. రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ధ్యానం, యోగా చేయాలని సూచించారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏలూరు సీటీఓ కోటేశ్వరరావు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈడీ గడ్డిపాటి అనిల్ కుమార్, పతంజలి రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కాలారి నరసింహారావు, సురేష్, అమెరికన్ బ్లూ క్రాఫ్ట్‌స్ ఈడీ రఘు, భీమినేని వెంకటేశ్వరరావు, పీఎఫ్ వెంకటేశ్వరరావు, నాగుల్ మీరా, చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత, అరుణ, స్వాతి, మువ్వా శ్రీను, ప్రసాద్, హైమా తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జేకేసీ కళాశాల
పూర్వ విద్యార్థుల సమ్మేళనం