నకిలీ డాక్టర్‌... ఆపై క్షుద్రపూజలు | fake doctor arrested in Hanamkonda | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్‌... ఆపై క్షుద్రపూజలు

Published Tue, Mar 14 2023 1:30 AM | Last Updated on Tue, Mar 14 2023 12:59 PM

fake doctor arrested in Hanamkonda - Sakshi

వరంగల్‌ క్రైం: మంత్రాలు, చేతబడుల పేరిట అమాయక ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎంఏ బారీ తెలిపారు. సోమవా రం హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పో లీస్‌స్టేషన్‌ పరిధిలోని నయీంనగర్‌కు చెందిన సయ్యద్‌ ఖదీర్‌ అహ్మద్‌, అతని అన్న కుమారుడు స య్యద్‌ షబీర్‌ అహ్మద్‌లు ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆస్పత్రిని ప్రారంభించి దాని ముసుగులో క్షు ద్ర పూజలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పోలీ సులకు అందిన పక్కా సమాచారంతో నకిలీ డాక్టర్‌ ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్న ఫారహీ న ఆస్పత్రిపై దాడులు నిర్వహించి నిందితులను అ దుపులోకి తీసుకొని విచారించినట్లు పేర్కొన్నారు.

నమ్మించి మోసం...
నిందితులు స్థానికులతో పాటు ములుగు, కరీంనగర్‌, జమ్మికుంట, కొండపాక, అదిలాబాద్‌, ఇతర గ్రామాల నుంచి వచ్చే అమాయకులను క్షుద్రపూజ లు చేసి చేతబడి తగ్గిస్తామని, సంతానం లేనివారికి సంతానం కలిగిస్తామని, ఆరోగ్యం, ఉద్యోగం ఇతర సమస్యలను పరిష్కరిస్తామని నమ్మబలికి మోసం చేసినట్లు తెలిపారు. సయ్యద్‌ ఖదీర్‌ అహ్మద్‌ గతంలో కరీంనగర్‌లో ఓ డాక్టర్‌ వద్ద సహాయకుడిగా పని చేసి అక్కడే వైద్యం నేర్చుకున్నట్లు తెలిపారు. సయ్య ద్‌ ఖదీర్‌ అహ్మద్‌ తండ్రి ఖరిముళ్ల ఖాద్రీ గతంలో పూజలు చేసి తాయితలు కట్టేవాడన్నారు. దీంతో ఖదీర్‌ అహ్మద్‌ నిబంధనలకు విరుద్దంగా కేయూ క్రాస్‌లో 35 ఏళ్లుగా ఫారహీన పేరిట క్లినిక్‌ నిర్వహిస్తున్నట్లు డీసీపీ బారీ తెలిపారు.

తన వద్దకు వచ్చే రోగులను గిట్టనివారు చేతబడి చేశారని, దయ్యం పట్టిందని, నరదృష్టి ఉందని, దోషాలు ఉండటంతో సంతానం కలగటం లేదని లేనిపోని భయబ్రాంతులకు గురిచేసి క్షుద్ర పూజలు చేసి వాటిని తగ్గిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యపరిస్థితి మెరుగుపడటానికి అల్లోపతి మందులు ఇచ్చి రోగం నయమైతే క్షుద్రపూజల వల్లే అని నమ్మిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్‌లో కొంత మంది ఇళ్లవద్దకు వెళ్లి క్షుద్రపూజలు నిర్వహించే వాడని డీసీపీ తెలిపారు. క్షుద్రపూజలకు సహకరించిన యాకుబ్‌బాబా, అ తని భార్య సుమరవీన్‌, ఎండీ ఇమ్రాన్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సయ్యద్‌ ఖదీర్‌ అహ్మద్‌పై గతంలో గుప్తనిధులు తవ్వకంపై ములుగు ఘన్‌పూర్‌ పో లీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు డీసీపీ తెలి పారు. నిందితుల నుంచి పూజ సామాగ్రి, ఒక సెల్‌ఫోన్‌, కారు, రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ ఫోర్స్‌ ఏ సీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వ ర్లు, శ్రీని వాస్‌రావు, ఎస్సైలు నిస్సార్‌పాషా, లవన్‌కుమార్‌, ఏఏవో స ల్మాన్‌పాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ స్వ ర్ణలత, కానిస్టేబుల్‌ భిక్షపతి, రాజేష్‌, రాజు, శ్రీని వాస్‌, శ్రవణ్‌కుమార్‌, నాగరాజు, నవీన్‌లను డీసీపీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement