● కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా నిషేధిత రైల్వే ప్రాంతంలో రైల్వే ఉద్యోగులైనా, ప్రైవేట్ వ్యక్తులైనా పార్క్‌చేస్తే వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ వివిధ అవసరాల కోసం కాజీపేట జంక్షన్‌కు వచ్చిన వారు తమ వాహనాలు, కార్లను రైల్వే సర్క్యూలేటింగ్ ఏరియాలోని నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేస్తున్నారన్నారు. ఈ దృశ్యాన్ని ఇటీవల తని ఖీల నిమిత్తం కాజీపేట జంక్షన్‌కు విచ్చేసిన రైల్వే సీనియర్ డీసీఎం చూసి సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్సీ ఆదేశాలనుసారం రైల్వే నో పా ర్కింగ్ జోన్‌లో ఇక మీదట ఎవరూ పార్క్ చేయొద్దన్నారు. ఒకవేలా పార్క్ చేస్తే రైల్వే యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. కొందరి రైల్వే అ ధికారులకు నోటీస్‌లు జారీ చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment