
10 రోజులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
హన్మకొండ అర్బన్/వరంగల్: యాసంగి పంట సంరక్షణకు రాబోయే పదిరోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సాగు నీరు, విద్యుత్ సరఫరాను అవసరమైన మేర పంటపొలాలకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి నీటి లభ్యత, నీటి పారుదల శాఖ పనితీరు, పంటలకు విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. యాసంగి పంటలకు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతీ నీటి చుక్కను వినియోగించుకోవాలని సూచించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment