బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: విద్యుత్ లైన్లకు నేరుగా కొక్కాలు తగిలించి, దొంగచాటుగా విద్యుత్ లైన్ల నుంచి వైరులాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడడం చూశాం. గతంలో మీటర్ ఉత్పత్తిలో సాంకేతిక లోపంతో టీవీ రిమోట్ ద్వారా మీటర్ రీడింగ్‌ను నిలిపివేసిన ఘటనలూ చూశాం. ప్రస్తుతం వరంగల్ మహానగరంలో గతానికి భిన్నంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు సవాల్ విసిరినట్లుగా సాగుతున్న విద్యుత్ చౌర్యం సాగుతున్న తీరు విద్యుత్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న త్రీ ఫేజ్ మీటర్ల ద్వారా కొందరు వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి.
చౌర్యం ఇలా..
విద్యుత్ లైన్ ద్వారా మీటర్లకు సర్వీస్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అదే మీటర్ నుంచి విద్యుత్ బయటకు వస్తుంది. మీటర్ లోపలకు వెళ్లి, బయటకు విద్యుత్ సరఫరా జరిగినప్పుడు మీటర్‌లో యూనిట్లు నమోదు అవుతాయి. విద్యుత్ మీటర్‌లో ఉండే ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా విద్యుత్ మీటర్‌లోకి వెళ్లడం, మీటర్ నుంచి వినియోగానికి బయటకు రావడం జరుగుతుంది. ఇదే కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మీటర్‌లోని మదర్ బోర్డుకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత్ రీడింగ్ నమోదవుతుంది. త్రీ ఫేజ్‌లో ఏ ఫేజ్‌లో విద్యుత్ అధికంగా వినియోగమవుతుందో మదర్ బోర్డుకు వెళ్లే ఆ ఫేజ్ వైర్‌ను కట్ చేస్తున్నారు. దీంతో మీటర్‌లో యూనిట్లు తక్కువగా నమోదు అవుతున్నాయి. మదర్ బోర్డుకు వెళ్లే ఫేజ్‌వైర్‌ను కట్ చేయడం వల్ల కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. దీన్ని గుర్తించాలంటే మీటర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే సాధ్యమవుతుంది.
గుర్తించారిలా..
ఎన్పీడీసీఎల్‌లోని విద్యుత్ సర్వీస్‌ల ప్రత్యేక విభాగం నిరంతరం తనిఖీలు చేస్తుంటుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ను తనిఖీ చేయగా ఈవిద్యుత్ చౌర్యం సంఘటన వెలుగు చూసింది. టాంగ్ టెస్టర్ ద్వారా మూడు ఫేజ్‌లు పరీక్షించగా.. ఒక ఫేజ్‌లో విద్యుత్ మదర్ బోర్డుకు చేరడం లేదని గుర్తించారు. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్, డీపీఏ విభాగం వారు గ్రూపులుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ అడ్వొకేట్స్ కాలనీలోని ప్రముఖ విద్యాసంస్థతోపాటు, హనుమకొండ చౌరస్తాలో బట్టల షాపు, అశోక హోటల్ సమీపంలోని బిర్యానీ సెంటర్‌తో పాటు మొత్తం 12 విద్యుత్ సర్వీసులు ఇదే విధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వరంగల్‌లో ఒక్కరికే చెందిన రెండు బేకరీల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్యాంపరింగ్ చేస్తామని
తిరుగుతున్న బృందాలు..
విద్యుత్ మీటర్ రీడింగ్ తగ్గిస్తామని ప్రత్యేకమైన నిపుణులు నగరం, పట్టణాల్లో తిరుగుతున్నారని విద్యుత్ అధికారులు తెలిపారు. రూ.10 వేలు ఇస్తే మీటర్ రీడింగ్ నమోదు కాకుండా చేస్తామని చెబుతున్నారని, ఇప్పటి వరకు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారంతా డబ్బులు చెల్లించి ఆ ప్రత్యేక నిపుణులచే విద్యుత్ మీటర్‌ల టాంపరింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోంది. విద్యుత్ విజిలెన్స్ విభాగం అధికారులు మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న వారి కోసం శోధిస్తున్నారు.
తనిఖీలు విస్తృతం చేశాం...
అత్యంత చాకచక్యంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇది నేరం. రూ.10 వేలు ఇస్తే యూనిట్లు తక్కువగా నమోదయ్యేలా మీటర్‌లో మార్పులు చేస్తామని కొందరు తిరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ చౌర్యానికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
– జి.సాంబరెడ్డి, డీఈ, హనుమకొండ టౌన్
విద్యుత్ చౌర్యానికి పాల్పడిన మీటర్‌ను పరిశీలిస్తున్న విద్యుత్ అధికారులు
నాలుగు రోజుల్లో
హనుమకొండ నగరంలో 1119 సర్వీస్‌లు తనిఖీ చేశారు. ఇందులో 12 సర్వీస్‌లు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆపరేషన్ విభాగానికి చెందిన 57, డీపీఈకి చెందిన 15 ప్రత్యేక బృందాలు
విస్తృతంగా తనిఖీలు
నిర్వహించాయి.
నగరంలో ఆధునిక సాంకేతికతతో విద్యుత్ చౌర్యం
న్యూస్‌రీల్
తనిఖీల్లో గుర్తించి విస్తుపోతున్న
ఎన్పీడీసీఎల్ అధికారులు
ఇప్పటివరకు 12 కేసులు నమోదు
దొంగతనం చేసేది త్రీ ఫేజ్ మీటర్ల
వినియోగదారులే..
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment