మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) అసోసియేషన్ బాధ్యులు మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌తోపాటు ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహన్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, అనురాధ, నీరజ, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఆర్డ్డీఓ కౌసల్య, డీపీఓ కల్పన, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాజేశ్‌కుమార్, రాజకుమార్, రామ్‌కిషన్, వేణుగోపాల్, డాక్టర్ మౌనికరాజ్, డాక్టర్ షఫీ పాల్గొన్నారు.
‘నీట్’కు కేంద్రాలను గుర్తించాలి
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్‌కు, కేంద్రాల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 6,300 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పరీక్షల కోఆర్డినేటర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment