ఇళ్ల జాబితాలో అవకతవకలుంటే చర్యలు
● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
● ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో సమీక్ష
హన్మకొండ చౌరస్తా: ‘ఇది ప్రజా ప్రభుత్వం. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కమిటీభ్యులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పథకం అమలులో లీడర్ అయినా.. కేడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. కొందరు నాయకులు సమస్యాత్మక గొడవలు, భూపంచాయతీలపై ఆసక్తి చూపుతున్నట్లు.. అలాంటివి తన దృష్టికొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, మామిండ్ల రాజు, విజయశ్రీ రజాలీ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment