‘ఇందిరా మహిళా శక్తి’ని వేగంగా ఏర్పాటు చేయాలి
వరంగల్ అర్బన్: ఇందిరా మహిళా శక్తి యూనిట్లను వేగంగా ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కమ్యునిటీ ఆర్గనైజర్లను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనలో
వేగం పెంచండి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. క్షేత్రస్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై మంగళవారం ప్రధాన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సమీక్షించారు.
పన్ను వసూళ్లపై కమిషనర్ ఆగ్రహం
పన్ను వసూళ్ల పురోగతి ఆశాజనకంగా లేదని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్నువసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఆయా సమావేశాల్లో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్
డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
అధికారులు, సిబ్బందితో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment