
ఫ్లాపులే తెలియని వీరుడు.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే ధీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన పరాక్రమవంతుడు.. ఎస్‌ఎస్ రాజమౌళి. ఈయన సినిమా లేటుగా తీస్తాడుమో కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తెరకెక్కిస్తాడు. అందుకే జక్కన్న ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రస్తుతం ఇతడు మహేశ్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు.
అందమైన ప్రేమరాణి..
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్‌లో జక్కన్న తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్న పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.
సినిమా విషయానికి వస్తే
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా(#SSMB29) తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయట. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function💥💥💥👌👌👌#SsRajamouli #SSMB29 #Party #RRR #TeluguFilmNagar #Tollywood #Bollywood #Hollywood #TFI pic.twitter.com/UynuQCDCOx
— YDR (@dharmaraju225g1) April 1, 2024
చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే!