అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్ట్
సికింద్రాబాద్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న పెడ్లర్‌ను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జీఆర్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లాకు చెందిన అబల్(23)వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన అతను కొద్ది రోజుల క్రితం అడవ పట్టణానికి వెళ్లి రైనో అనే వ్యక్తిని కలిశాడు. మహారాష్ట్రలో గంజాయికి చాలా డిమాండ్ ఉందని, తనకు 8 కిలోల గంజాయి కావాలని చెప్పిన రైనో పూణేకు గంజాయి తరలిస్తే ప్యాకెట్‌కు రూ. 1000 ఇస్తానని చెప్పడంతో అబల్ అందుకు అంగీకరించారు. దీంతో అతను మాసియా అనే వ్యక్తి నుంచి కిలో రూ. 800 చొప్పున గంజాయి కొనుగోలు చేసి అబల్‌కు అప్పగించాడు. ఈ నెల 4న అతను గంజాయి ప్యాకెట్లతో ఇచ్చాపురం నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన అబల్ బ్యాగ్‌ను సోదా చేయగా రూ.1.96 లక్షల విలువైన 7.8 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్‌ఐ మాజీద్, హెచ్‌సీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
7.84 కిలోల గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment