
అనుమానాస్పద స్థితిలో నిమ్స్ ప్రొఫెసర్ మృతి
సూరారం కట్టమైసమ్మ చెరువులో మృతదేహం
● అప్పుల బాధ తాళలేకనే ఆత్మహత్య?
లక్డీకపూల్: నిమ్స్ బయో కెమిస్ట్రీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.విజయ్ భాస్కర్ (62) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 25న సూరారంలోని తన ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన గురువారం ఉదయం 11 గంటలకు కట్టమైసమ్మ చెరువులో మృతదేహమై కనిపించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులను పిలిచి చూపించగా.. విజయ భాస్కర్‌దిగా గుర్తించారు. విజయభాస్కర్ అదృశ్యంపై అంతకుమునుపు సూరారం ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆయన ఐదేళ్ల క్రితం నిమ్స్ బయో కెమిస్ట్రీ విభాగంలో చేరారు. విజయభాస్కర్ మృతికి ఆర్థికపరమైన అంశాలే కారణమని తెలుస్తోంది. బంధువులు, స్నేహితులతో పాటు తోటి వైద్యులు, సిబ్బంది వద్ద పెద్ద మొత్తంలో ఆయన అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల బాధ తాళలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విజయభాస్కర్ భార్య పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment