
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్‌లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శనివారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ‘టీజీ 07 పి 9999’ నెంబర్‌ను ఓ వాహనదారు రూ.9.37 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అలాగే ‘టీజీ 07 పి 0009’ నెంబర్ కోసం మరో వాహనదారు రూ.7.50 లక్షలు చెల్లించారు. ‘టీజీ 07పి 999’ నెంబర్ కోసం మరొకరు రూ.3 లక్షలు చెల్లించినట్లు జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: ఉద్యోగం రావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన నూకరాజు (29) బీటెక్ పూర్తి చేశాడు. నగరంలోని అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లొచ్చిన నూకరాజు.. తనకు తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో రూమ్‌మేట్‌కు పార్టీ కూడా ఇచ్చాడు. కానీ.. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రూమ్‌మేట్ మణికంఠ ఆఫీస్‌కు వెళ్లాడు. గదిలో నూకరాజు ఒక్కడే ఉన్నాడు. ఇదేరోజు రాత్రి 7.30 గంటలకు మణికంఠ వచ్చి చూడగా గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా.. మణికంఠ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో వెంటనే హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు నూకరాజు ఉరి వేసుకుని ఉన్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని శనివారం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment