
ఉత్సాహంగా డెసిబుల్ డాష్ రన్
గచ్చిబౌలి: వినికిడి సమస్యలపై అవగాహన పరుగును ఉత్సాహంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీలలోని మైక్రో కేర్ ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మౌర్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద 2కే, 5కే, 10కే రన్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, డాక్టర్ ప్రకాశ్ జెండా ఊపి ప్రారంభించారు. డెసిబుల్ డాష్ కేవలం పరుగు మాత్రమే కాదని, ఇది వినికిడి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, వినికిడి సవాళ్లతో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చే శక్తిమంతమైన ఉద్యమంగా నిర్వహిస్తున్నామన్నారు. రన్నర్లు, వైద్యులు, పారామెడికల్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు, కళాకారులు, ప్రభావశీలురు, ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, ఆరోగ్య ఔత్సాహికులు పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అశ్విని అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో జెండా ఊపి రన్‌ను ప్రారంభిస్తున్న నిర్వాహకులు