
ముగిసిన విజ్ఞాన్ వైభవ్
చివరి రోజు విద్యార్థులతో కిటకిటలాడిన స్టాల్స్
ఆకట్టుకున్న డ్రోన్ షో
చందానగర్: గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ –2025 ఆదివారంతో ముగిసింది. మూడు రోజులపాటు నిర్వహించిన యుద్ధ పరికరాల ప్రదర్శన విద్యార్థులను, యువతను ఎంతో ఆకట్టుకుంది. రక్షణ రంగానికి చెందిన అనేక అరుదైన ఆయుధాలు, పరికరాలు వివిధ స్టాల్స్‌లలో ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో భారత్ మరో పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని డీఆర్‌డీఓ ప్రతినిధులు పేర్కొన్నారు. మూడు రోజులపాటు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రక్షణరంగ పరిశోధన కేంద్రాలు, ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన ఆయుధాలను తిలకించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇండియన్ ఆర్మీ అధికారులతో విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
అంతరిక్షం నమూనా వద్ద యువతి

ముగిసిన విజ్ఞాన్ వైభవ్

ముగిసిన విజ్ఞాన్ వైభవ్