సాక్షి, సిటీబ్యూరో: హోల్‌సేల్ ఆయిల్ వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని వరుస మోసాలకు పాల్పడి, ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు మోసగాళ్లను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరిపై 9 వారెంట్లు, మరొకరిపై నాలుగు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. ఓల్డ్ మలక్‌పేట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన టి.సాయినందకిషోర్ 2006 నుంచి నేరబాట పట్టాడు. తానో రిటైల్ ఆయిల్ వ్యాపారినంటూ హోల్‌సేల్ వ్యాపారుల దగ్గరకు వెళ్తాడు. తొలుత చిన్నచిన్న మొత్తంలో ఖరీదు చేసి పక్కాగా చెల్లింపులు చేస్తాడు. ఆపై ట్యాంకర్లు బుక్ చేసుకుని, వాటిని మార్కెట్‌లో విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2017లో ఆజంపురకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం ఇతడితో జట్టుకట్టాడు. వీళ్లిద్దరూ కలిసి ఇదే పంథాలో మోసాలు చేశారు. 25 నేరాలను నందకిషోర్ ఒక్కడే చేయగా.. మరో పది నేరాలు రహీంతో కలిసి చేశాడు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్లగొండల్లో కేసులు నమోదై ఉన్నాయి. 2006 నాటి కేసుల్లోనూ నందకిషోర్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో 9 వారెంట్లు జారీ అయ్యాయి. రహీంపై మరో నాలుగు వారెంట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఏడు మారుపేర్లతో చెలామణి అయిన నంద కిషోర్ ప్రస్తుతం ఘట్‌కేసర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. రహీం ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తాడు. వీరి కదలికలపై సౌత్–ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైకు పి.సాయిరాం, షేక్ కవియుద్దీన్, ఎం.మధు వలపన్ని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్, రామ్‌గోపాల్‌పేట ఠాణాలకు అప్పగించారు.
ట్యాంకర్లు బుక్ చేసుకుని భారీ మోసాలు
ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ద్వయం
చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్
ఆయిల్ వ్యాపారులే టార్గెట్
ఆయిల్ వ్యాపారులే టార్గెట్