
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని, వెట్టి కార్మికులుగా, బలవంతపు వివాహాలు, ఎల్లకాలం ఇంటిపనిలో మగ్గిపోవడం లాంటి దోపిడీలకు గురవుతున్నారని ఒక నూతన అధ్యయనం అంచనా వేసింది. నేడు ప్రతి 130 మంది మహిళలు, బాలికల్లో ఒకరు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని, ఇది ఆస్ట్రేలియా జనాభాకంటే ఎక్కువని వాక్ ఫ్రీ యాంటీ స్లేవరీ ఆర్గనైజేషన్ కో ఫౌండర్ గ్రేస్ ఫారెస్ట్ తెలిపారు.
మానవ జాతి చరిత్రలో ఇంత వరకు ఎప్పుడూ లేనంత మంది మహిళలు బానిసత్వంలో మగ్గుతున్నారని ఆమె యూ ఎన్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌లు వాక్‌ఫ్రీ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం బలవంతపు లైంగిక దోపిడీకి గురయ్యేవారిలో 99 శాతం, బలవంతపు వివాహాల బాధితుల్లో 84 శాతం మంది, బలవంతపు శ్రమదోపిడీ బాధితుల్లో 58 శాతం మహిళలే.
Comments
Please login to add a commentAdd a comment