
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం శనివారం ఉదయం జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్‌స్క్ ప్రాంతంలోని బఖ్ముత్, లీమాన్, మరింకా నగరాల పరిసరాల్లో రెండు సైన్యాలకు మధ్య భీకర పోరు సాగుతోంది.
ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను వెళ్లగొట్టేందుకు జరుగుతున్న పోరాటంలో తుది వరకు యూరప్‌తోపాటు ఈయూ మద్దతుగా నిలుస్తాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హామీ ఇచ్చారు. శనివారం ఈయూ అధ్యక్ష బాధ్యతలను స్పెయిన్ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment