ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గలిస్తాన్ ప్రాంతంలో అత్యంత రద్దిగా ఉండే సిద్దిఖీ బజార్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఏడు అంతస్తులున్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పలు ఆఫీస్‌లు, స్టోర్లు ఉన్నాయి. పేలుడు అనంతరం 11 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో శానిటైజేషన్ మెటీరియల్స్ విక్రయించే ఓ స్టోర్‌లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: ఇరాన్‌లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment