
లండన్: కరోనా వైరస్ చికిత్స కోసం అమెరికన్ కంపెనీ మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ మొదటిసారిగా టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మెర్క్ కంపెనీ తయారు చేసిన మోల్నుపిరవిర్ టాబ్లెట్‌కు బ్రిటన్ మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. గత నెలలో చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టాబ్లెట్‌ను మెరుగైన ఫలితాలు చూపించినట్లు మెర్క్ సంస్థ పేర్కొంది.
చదవండి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడ 5 లక్షల మరణాలు
కోవిడ్‌తో మృతి లేదా ఆస్పత్రిపాలు అయ్యే రిస్క్‌ను ఈ మాత్ర 50 శాతం వరకు తగ్గిస్తుందని పేర్కొంది. వీలైనంత త్వరలో దేశంలో అధ్యయనం చేసి కోవిడ్ రోగులకు మోల్నుపిరావిర్‌ను అందించే ప్రణాళికలను రూపొందించడానికి ప్రభుత్వం, ఆరోగ్య సేవల విభాగం(ఎన్‌హెచ్‌ఎస్)తో కలిసి పనిచేస్తుందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ తెలిపారు. ప్రపంచంలో కరోనా చికిత్స కోసం టాబ్లెట్‌ను ఆమోదించిన తొలిదేశంగా బ్రిటన్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment