
టోక్యో:జపాన్‌ని ఒసాకా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాణిజ్య సముదాయానికి సంబంధించిన 8అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందినటట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనంలోని 4వ అంతస్తు నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి.. సహాయక చర్యలు చేపట్టారు.
చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!
Comments
Please login to add a commentAdd a comment