ఒటావో : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని కెనడా ప్రభుత్వం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ నుంచి కెనడాలోకి ప్రవేశించే విదేశీ ప్రయాణికులపై నిషేధాన్ని ఆగష్టు 31 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం కొత్తగా కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఇది ప్రజలు కరోనా బారిన పడితే వారిని హెచ్చరించేందుకు సహయపడుతోంది. ఇది మొబైల్‌లోని యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. (కెనడాలో తెలుగు యువకుడు మృతి)
కాగా కెనడాకు అమెరికాతో సరిహద్దు ప్రయాణాలపై ప్రత్యేక ఒప్పందం ఉంది. ఇటీవల ఇరు దేశాలు అనవసర ప్రయాణాలపై ఆంక్షలను ఆగష్టు 21 వరకు పెంచేందుకు అంగీకరించాయి. అయితే తాజాగా కెనడాలో కరోనా మహమ్మారి కేసులు, మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై నిషేధాన్ని మరోసారి పొడిగించేందుకు నిర్ణయించాయి. మరోవైపు దేశంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారి శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. గురువారం నాటికి కెనడాలో మొత్తం కేసుల సంఖ్య1,15,799కు చేరాయి. ఇప్పటి వరకు 8,929 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. (విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment