Galwan Valley Clash: China Reveals Details Of PLA Soldiers Who Killed In Clash With India - Sakshi
Sakshi News home page

Galwan Clash: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా

Published Fri, Feb 19 2021 8:12 AM | Last Updated on Fri, Feb 19 2021 1:27 PM

China First Time Reveals Details Soldiers Demise Galwan Valley June 2020 - Sakshi

బీజింగ్‌: భారత్‌- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారి తీసిన గల్వాన్‌ ఘటనలో మృతి చెందిన తమ సైనికుల వివరాలపై డ్రాగన్‌ దేశం తొలిసారిగా నోరు విప్పింది. తూర్పు లదాఖ్‌ ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు అమరులైనట్లు తెలిపింది. ఈ మేరకు మృతుల పేర్లను కూడా చైనా విడుదల చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావోతో పాటు, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందినట్లు పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అదే విధంగా భారత్‌తో జరిగిన ఘర్షణలో ఆర్మీని ముందుండి నడిపించిన కల్నల్‌కు సముచిత గౌరవం కల్పించినట్లు పేర్కొంది.

కాగా గతేడాది జూన్‌లో, వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లు- డ్రాగన్‌ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్‌ ఆర్మీ దురాగతానికి కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘటనలో తమ జవాన్లు మరణించినట్లు గతంలో ధ్రువీకరించలేదు. ఇక శుక్రవారం తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నలుగురు మృతి చెందినట్లు వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement